తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఒకటి అని చెప్పవచ్చు. ఎన్టీఆర్‌ని ఎక్కువగా అభిమానించే సిక్కోలు వాసులు..టిడిపి ఆవిర్భావం నుండి మద్ధతుగా ఉంటూ వస్తున్నారు. అలాగే జిల్లాలో టిడిపికి బలమైన నేతలు ఉండటం పెద్ద ప్లస్. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో జిల్లాలో టిడిపి దారుణంగా ఓడింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే టిడిపి 2 సీట్లు గెలిస్తే, వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది.
ఇక ఆ పరిస్తితి నుంచి టిడిపి బయటపడింది..పార్టీ పికప్ అవుతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత టిడిపికి కలిసొస్తుంది. దీంతో జిల్లాపై టిడిపికి పట్టు పెరిగింది. ఇదే సమయంలో చంద్రబాబు కూడా గత ఎన్నికల మాదిరిగా కాకుండా..ఈ సారి ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు సీట్లు ఖాయమని హింట్ ఇచ్చేశారు. దీంతో సిక్కోలులో దాదాపు టిడిపి గెలుపు గుర్రాలు ఫిక్స్ అయ్యారు.

మొదట టిడిపి సిట్టింగ్ సీట్లు అయిన ఇచ్చాపురం, టెక్కలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయనున్నారు. ఇచ్చాపురంలో అశోక్, టెక్కలిలో అచ్చెన్నాయుడు పోటీ చేయనున్నారు..అలాగే వీరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక ఆమదాలవలసలో కూన రవికుమార్, పలాసలో గౌతు శిరీష పోటీ చేయడం ఖాయం..వీరికి గెలిచే ఛాన్స్ ఉంది.
పాతపట్నంలో కలమట వెంకటరమణ పోటీ చేసే ఛాన్స్ ఉంది..పాలకొండ సీటులో నిమ్మక జయరాజు పోటీ చేస్తారా? లేక వేరే అభ్యర్ధిని పెడతారో చూడాలి. ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావు, రాజాంలో కొండ్రు మురళీమోహన్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీకు ఛాన్స్ ఇస్తారా? లేక వేరే నేతని పెడతారో చూడాలి. నరసన్నపేట సీటులో కూడా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం ఇక్కడ టిడిపికి 6 సీట్లలో ఆధిక్యం ఉంది. ఎన్నికల నాటికి ఇంకా బలపడే ఛాన్స్ ఉంది.