గత కొన్ని రోజులుగా విజయవాడ(బెజవాడ) రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయాల్సిన కేశినేని..సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు నేతల వల్లే టీడీపీకి నష్టం జరుగుతుందని, అందుకే పార్టీని ప్రక్షాళన చేయాలని కేశినేని డిమాండ్ చేస్తున్నారు. కేశినేని ప్రధానంగా టార్గెట్ చేసేది నలుగురిని దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్దా వెంకన్న, కేశినేని శివనాథ్.

వీరి టార్గెట్ గానే కేశినేని ఫైర్ అవుతున్నారు. వారు కూడా గ్రూపుగా కేశినేనికి చెక్ పెట్టడానికి చూస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ఈ మధ్య మైలవరంలో దేవినేని వ్యతిరేక వర్గంగా టీడీపీలో ఉన్న బొమ్మసాని సుబ్బారావు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, తాము నాలుగు సార్లు గెలిచామని సామంత రాజులు మాదిరిగా ఉంటే…ప్రజలు ఎత్తి కృష్ణా నదిలో పడేస్తారని, ఈ సారి తనతో పాటు పలువురు సీనియర్ నేతలు సీట్లు త్యాగం చేయాలని పరోక్షంగా దేవినేనిపై విమర్శలు చేశారు.

తర్వాత నందిగామలో పర్యటిస్తూ..తన తమ్ముడు కేశినేని శివనాథ్‌కు విజయవాడ ఎంపీ సీటు ఇస్తే తాను సహకరించనని, మరో ముగ్గురు కూడా సహకరించనని అన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, రియల్ దందాలు చేసేవారికి తన సపోర్ట్ ఉండదని బాంబు పేల్చారు. నెక్స్ట్ తనకు సీటు ఇవ్వకపోతే ప్రజలు ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటారని అన్నారు.

ఇలా కామెంట్లు చేస్తూ వచ్చిన కేశినేని..తాజాగా విజయవాడ వెస్ట్‌లో వైసీపీ కార్యకర్తలని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే ఓ వైపు కొందరు టీడీపీ నేతలని టార్గెట్ చేస్తూనే..మరోవైపు టీడీపీ బలోపేతం కోసం కేశినేని కృషి చేస్తున్నారు. దీంతో కేశినేని రాజకీయం ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది..ఆయన టీడీపీకి ప్లస్ అవుతున్నారో…మైనస్ అవుతున్నారో క్లారిటీ లేదు.

ReplyForward |
Leave feedback about this