విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో అసలు క్లారిటీ లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా విజయవాడ టిడిపిలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలు రాష్ట్రంలో టిడిపి కాస్త బలంగా ఉన్న ప్రాంతం విజయవాడ. కానీ టిడిపి నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ నాశనమవుతుంది. గత కార్పొరేషన్ ఎన్నిక సమయంలో నేతల మధ్య రచ్చ జరిగిన విషయం తెలిసిందే.

ఎంపీ కేశినేని నాని డైరక్ట్‌గా బుద్దా వెంకన్న-బోండా ఉమాలపై విమర్శలు చేశారు. అటు ఆ ఇద్దరు కూడా కేశినేనిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వీరికి బాబు సర్దిచెప్పేలోపే ఎన్నిక జరిగింది…విజయవాడ కార్పొరేషన్‌లో టిడిపి ఘోరంగా ఓడింది. ఓడిపోయాక కూడా వీరి రచ్చ ఆగట్లేదు. అలాగే కొనసాగుతూ ఉంది. ఇదే క్రమంలో ఎంపీ కేశినేని నాని నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించేశారు. తన కుమార్తె శ్వేత కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు.దీంతో విజయవాడ టిడిపిలో కొత్త టెన్షన్ మొదలైంది. బలమైన కేశినేని తప్పుకుంటే పార్లమెంట్ పరిధిలో పార్టీకి ఇబ్బంది వస్తుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. అందుకే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తమ్ముళ్ళు…వరుసపెట్టి కేశినేనిని కలిసే పనిలో ఉన్నారు. పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేశినేని పార్టీ అయితే మారేది లేదని చెబుతున్నారు గానీ, పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇదే సమయంలో కేశినేని ప్రత్యర్ధి వర్గంగా ఉన్న బుద్దా వెంకన్న విజయవాడ పార్లమెంట్‌లో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలిసిందే. అయితే కేశినేనికి ఉన్నా సత్తా బుద్దాకు లేదు. కేశినేనికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫాలోయింగ్ ఉంది. కానీ బుద్దాకు కనీసం విజయవాడలోనే ఫాలోయింగ్ లేదు. కాబట్టి ఈ అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇస్తే బెటర్ అని తమ్ముళ్ళు అంటున్నారు. ఎట్టి పరిస్తితుల్లో కేశినేని బరిలో ఉండాలని కోరుతున్నారు.
Discussion about this post