గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం విజయవాడ పార్లమెంట్‌లో టిడిపి తరుపున ఎంపీగా కేశినేని నాని విజయం సాధించారు. అయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది కేవలం ఒకే ఒక సీటు అది కూడా విజయవాడ తూర్పు….మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయింది. అయితే ఆరు నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయినా సరే విజయవాడ పార్లమెంట్‌లో మాత్రం గెలిచింది.

అది ఎలా సాధ్యమైందంటే క్రాస్ ఓటింగ్ ద్వారా….ఏడు నియోజకవర్గాల్లో ప్రజలు కాస్త కేశినేని వైపు మొగ్గు చూపారు అంటే….సొంత ఇమేజ్‌తో కేశినేని గెలిచారని చెప్పొచ్చు. అయితే అలా గెలిచిన కేశినేనికి సొంత పార్టీ ద్వారా ఎప్పటికప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఇటు కేశినేని కూడా ఏ మాత్రం తగ్గకుండా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. అటు నుంచి నానికి కౌంటర్లు వచ్చాయి…అంటే విజయవాడ టిడిపిలో ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత రచ్చ జరుగుతుంది కాబట్టే కేశినేని….నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు…అలాగే తన కుమార్తె కూడా పోటీకి దిగరని క్లారిటీ ఇచ్చేశారు. అయితే కేశినేని నాని పోటీ చేయనని ప్రకటించాక…కింది స్థాయి నేతలు ఆయన్ని బుజ్జగించుకుంటున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ పోటీ చేయాలని కోరుతున్నారు. కానీ టిడిపి అధిష్టానం నుంచి నానికి ఎలాంటి బుజ్జగింపులు లేవని తెలుస్తోంది. నానీని చంద్రబాబు కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. నాని ఎలాంటి నిర్ణయం తీసుకున్న…తమకు అనవసరం అన్నట్లు ముందుకెళుతున్నారు.

కనీసం బుజ్జగించి…మీరు పోటీ చేయాలి…అప్పుడే పార్టీకి ప్లస్ అవుతుందనే కోణం టిడిపి అధిష్టానంలో కనబడటం లేదు. అసలు కేశినేని సైడ్ అయితే..ఆయన ప్లేస్‌లో విజయవాడ పార్లమెంట్‌లో గెలిచే సత్తా ఉన్న నాయకుడు ఎవరో కనబడరు. ఆ బుద్దా వెంకన్నకు అంత సీన్ లేదు. నెట్టెం రఘురాం మళ్ళీ పోటీకి దిగే ఛాన్స్ లేదు. మరి కేశినేనిని ఏ నాయకుడుతో రీప్లేస్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారో క్లారిటీ లేదు.
Discussion about this post