May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

కేతిరెడ్డి సొంత తప్పిదాలు..ధర్మవరంలో ఈజీ కాదా?

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల్లో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి కాస్త బెటర్ అని, ఆయన ఎలాంటి రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా, ఆయన పని ఆయన చేసుకుంటారని, ప్రజల్లోనే ఉంటారని, ఇలాంటి ఎమ్మెల్యేని కావాలని కేవలం ఏపీ ప్రజలే కాదు..తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కేవలం ప్రతిరోజూ ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతి ఊరిలో తిరగడం ప్రజల సమస్యలు తెలుసుకోవడం…పరిష్కరించడం చేస్తున్నారు.

అయితే ఆయన ప్రజల్లో తిరుగుతున్నారని రాష్ట్రమంతా ఎలా తెలిసిందంటే..ఆయన తిరిగేది సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చుకుంటారు. సరే లైవ్ ఇచ్చుకున్న ఆయన మంచి పనిచేస్తున్నారని అనుకున్నారు. ఆఖరికి టి‌డి‌పి వాళ్ళు కూడా కేతిరెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉండేవాళ్లు. అలాంటిది ఇటీవల రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో కేతిరెడ్డికి పూర్తి రివర్స్ అవుతుంది. ఇప్పటికే ఆయన సోషల్ మీడియాలో డ్రామా ఆడుతున్నారని, అసలు ప్రజలు తిరిగే నేతకు వీడియోలు, లైవ్ ఇవ్వడం ఎందుకని అంటున్నారు.

అలాగే ఇటీవల లోకేష్ పాదయాత్ర ధర్మవరంలో సాగింది..అప్పుడు లోకేష్..కేతిరెడ్డి టార్గెట్ గా భూ కబ్జా ఆరోపణలు చేశారు. అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్నారని, సెల్ఫీలు తీసి మరీ పెట్టారు. దీన్ని డిఫెండ్ చేయకుండా..అమరావతిలో కరకట్టపై బాబు అక్రమంగా నివాసం ఉంటున్నారని వీడియో పెట్టారు. అక్కడే ఆయనకు రివర్స్ అయింది. అసలు అది బాబు సొంత ఇల్లు కాదు..పైగా దానికి పర్మిషన్ వచ్చింది వైఎస్సార్ హయంలో.

అక్కడ నుంచి కేతిరెడ్డిపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. అలాగే రాజకీయంగా బాబుని టార్గెట్ చేసి ఎగతాళి చేస్తుండటంతో కేతిరెడ్డి క్యారెక్టర్ ఇదే అంటూ తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి కేతిరెడ్డి తనపై నెగిటివ్ తానే తెచ్చుకున్నట్లు ఉన్నారు. దీంతో ఈ సారి ధర్మవరంలో ఆయనకు గెలుపు సులువు కాదనే చెప్పాలి.