తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మెజారిటీ స్థానాల్లో సొంత నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ఇదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పోరు మరింత పీక్స్ లో ఉంది. పైగా ఇక్కడ కొందరు నేతలు జంపింగ్‌లకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు..ఇటీవల ఖమ్మం వచ్చి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు..అటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని కలిశారు.

ఎప్పటినుంచో తుమ్మల, వీరయ్యల మధ్య ఉన్న విభేదాలకు స్వస్తి పలికేలా మీటింగ్ పెట్టారు. ఇక అసంతృప్తితో ఉన్న తుమ్మల పార్టీ వీడకుండా అడ్డుకట్ట వేసేలా, తుమ్మలకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు చూశారు. అయితే ఇలా హరీష్ ఖమ్మంలో కారుని సెట్ చేయాలని చూశారు. కానీ హరీష్ ఎంత ట్రై చేసిన ఖమ్మంలో కారు పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా జంప్ అవ్వనున్నారు. అలాగే ఇంకా చాలా స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో రచ్చ ఎక్కువ. ఆ సీట్లని ఒకరికి ఇస్తే..మరొకరు సహకరించేలా లేరు. ఇక అక్కడ టీడీపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇటీవలే చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. పైగా ఖమ్మంలో టీడీపీ క్యాడర్ ఎక్కువ ఉంది.

అయినా గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే బీఆర్ఎస్ ఒక సీటు గెలుచుకుంది. 7 మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలని లాక్కుంది. అలా లాక్కోవడం వల్లే ఈ పోరు కనిపిస్తోంది. ఏదేమైనా ఖమ్మంలో కారు పార్టీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది.
