May 31, 2023
telangana politics

ఖమ్మం గడ్డ బిజెపి అడ్డ! గల్లా వ్యాఖ్యలు నిజమైతుందా ?

తెలంగాణ  రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈమేరకు భాజపా చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్య నేతలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితో  భేటీ కానున్నారు.

పొంగులేటికి సెక్యూరిటీ తొలగించినప్పుడు  భారతీయ జనతా పార్టీ  ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఒక వేదిక మీద ప్రసంగించిన వాక్యాలు తెలంగాణ రాష్ట్రంతట  పెను దుమారాన్ని రేపాయి, ఒక వంతు తొలత  ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో నుంచి భాజపా లోకి    పొంగులేటిని ఆహ్వానించింది  సత్యనారాయణ అని చెప్పుకోవచ్చు .

వాస్తవానికి భారాస నుంచి బహిష్కరణకు గురైన తర్వాత భాజపాలోకి రావా లని ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వా నించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు తనను సంప్రదిస్తున్నారంటూ. మాజీ ఎంపీ పలుమార్లు వ్యాఖ్యానించారు. భారాసను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా.. కేసీఆర్ను సీఎం కాకుండా చేసే పార్టీలోకే వెళతానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి భారాస అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకని వ్వబోనని శపథం చేశారు. మరికొద్దిరోజుల్లోనే ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధమ , వుతున్నారు. ఈలోగా భాజపా ముఖ్యనేతలు పొంగులే టితో భేటీ ఉమ్మడి జిల్లాల రాజకీయాలు వేడెక్కాయి.శ్రీనివాసరెడ్డి బిజేపిలోకి వస్తే పువ్వాడ రాజకీయ భవిష్యత్తుకి ఎండ్ కార్డు పడ్డట్టే అని ప్రజలు అనుకుంటున్నారు