రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి గాని..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు..కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇంకా తాము చేసిన ప్రజలు తమ వైపే ఉంటారని, ఇంకా శాశ్వతంగా తామే అధికారం అనే విధంగా ముందుకెళుతున్నారు. జగన్ సైతం తానే 30 ఏళ్ల పాటు సిఎం గా ఉంటానని అంటున్నారు. ఇదే క్రమంలో గుడివాడలో తానే శాశ్వతంగా గెలుస్తాననే విధంగా కొడాలి నాని భావిస్తున్నారు.
తాజాగా గుడివాడకు జగన్ వచ్చారు. టిడ్కో ఇళ్లని ప్రారంభించారు. టిడిపి హయంలో దాదాపు 80 శాతం పూర్తి చేసుకున్నా టిడ్కో ఇళ్లని నాలుగేళ్లలో మిగిలినవి పూర్తి చేసి వైసీపీ రంగులు వేసి తాజాగా వాటిని లబ్దిదారులకు అందజేశారు. అదేమంటే తామే మొత్తం కట్టామని అంటున్నారు. సరే ఆ విషయం పక్కన పెడితే..జగన్ శాశ్వత సిఎంగా ఉంటారని, ఇక గుడివాడలో తనకు ఓటమే లేదని కొడాలి అన్నారు. దమ్ముంటే చంద్రబాబు గుడివాడలో పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ చేశారు.

ఇప్పటికే పలుమార్లు ఇలా సవాళ్ళు చేశారు. అయితే గుడివాడలో ప్రస్తుతం కొడాలికి లీడ్ ఉంది..అందులో డౌట్ లేదు. ఇటీవల సర్వేల్లో ఆయనకు లీడ్ కనిపిస్తుంది. కాకపోతే ఇంతకాలం అధికారం లేకపోవడం వల్ల గుడివాడకు ఏం చేయలేదని అనుకున్నారు. కానీ అధికారంలో ఉండి కూడా ఇప్పుడు గుడివాడకు కొడాలి ఏం చేయలేదనే భావన ప్రజల్లో ఉంది.
కాబట్టి ఎన్నికల సమయంలో ప్రజా తీర్పు ఎలాగైనా మారిపోవచ్చు. అలా కాకున శాశ్వతంగా తానే గెలుస్తానని కొడాలి అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి-జనసేన కలిస్తే గుడివాడలో కొడాలికి కాస్త రిస్క్ ఎక్కువని తెలుస్తుంది.