ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విషయంలో వైసీపీ నేతలు ఏ విధంగా నోరు జారారో అందరికీ తెలిసిందే. ఆమెని ఉద్దేశించి ఎలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో కూడా తెలుసు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబులు కామెంట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. వారికి సంబంధించి ఆడియో, వీడియోలు కూడా ఉన్నాయి. ఇక వైసీపీ నేతలు అలా మాట్లాడటంపై చంద్రబాబు సైతం ఎప్పుడూలేని విధంగా కన్నీరు కూడా పెట్టుకున్నారు.

ఇక దీనిపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు..పక్కనే ఉన్న తెలంగాణ నేతల నుంచి స్పందన వచ్చింది. పార్టీలకు అతీతంగా వైసీపీ నేతల మాటలని ఖండించారు. అయినా సరే తాము ఎక్కడా కూడా భువనేశ్వరి పేరు తీయలేదని, ఆమెని ఏమి అనలేదని వైసీపీ నేతలు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కొడాలి నాని సైతం ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎప్పటిలాగానే చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. సెక్యూరిటీ తీసి వస్తానని, బాబు కూడా సెక్యూరిటీ తీసేయాలని, చూసుకుందాం ఇద్దరం.. ఒకే ఒక దెబ్బ.. ఒక్కటే తన్ను… ఇక్కడి నుంచే చంద్రబాబు మీదుగా నడుచుకుంటూ విజయవాడ వెళ్తానని కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చచ్చిన శవానివి.. జడ్ కేటగిరీ ఎందుకు? అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ కోసం భార్యనూ రోడ్డుపైకి తీసుకొచ్చారని, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఇష్టమొచ్చినట్లు కొడాలి, బాబుని ఉద్దేశించి మాట్లాడారు. అయితే భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు ఏం మాట్లాడారో..అంత స్పష్టంగా ఉంది. అయినా సరే కొడాలి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే మీడియా చానల్స్ కూడా వారు మాట్లాడినా మాటలని చూపించడం లేదు. దీంతో తాము ఏం మాట్లాడామో చెప్పాలని కొడాలి ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ కొడాలి ఎంత కవర్ చేసినా…జనాలకి అర్ధమవ్వాల్సింది…అర్ధమైంది…ఇప్పుడు ఎంత కవర్ చేసుకున్న ఉపయోగం లేదనే చెప్పాలి.

Discussion about this post