కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్…పైకి పరుష పదజాలం వాడుతూ ప్రత్యర్ధులని తిడతారు గానీ…ఒకోసారి నాని మాటల్లో లాజిక్‌లు ఉంటాయి. ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇవ్వడంలో అర్ధం ఉంటుంది. అయితే ఏమైందో గానీ ఈ మధ్య నాని మాటలకు ఏ మాత్రం లాజిక్ ఉండటం లేదని, ఆయన ఏదో గుడ్డిగా ప్రత్యర్ధులపై ఫైర్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎందుకంటే ఈ మధ్య కొడాలి చేసే విమర్శలు అసలు అర్ధంపర్థం లేకుండా ఉంటున్నాయి. ఇటీవల కొడాలి చేసే సవాళ్ళు కూడా అర్ధం లేకుండానే ఉన్నాయి. నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అలాగే నెక్స్ట్ జగన్‌ని మాజీ సిఎం చేసిన సరే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అసలు పవన్ కల్యాణ్ జీవిత కాలంలో జగన్‌ని మాజీ సిఎంని చేయలేరని అన్నారు. అంటే ఇంకా జగనే ఏపీకి సిఎంగా ఉంటారా? అది సాధ్యమయ్యే పనేనా? అంటే కాదనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేదు. ఇక కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారో లేదో కొడాలికే బాగా తెలుసు.

ఇక ఈ సవాళ్ళ విషయం పక్కనబెడితే…సినిమా టిక్కెట్ల అంశంలో కూడా కొడాలి ఏ మాత్రం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా టిక్కెట్ ధరలు పెంచుకుంటున్నారని, ప్లాప్ సినిమాలకు సైతం భారీగా వసూలు చేస్తున్నారని, సినిమాలని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి జనాలను దోచుకుంటున్నారని, కోర్టులు అనుమతించాయని ఇష్టారాజ్యంగా టిక్కెట్లు ధరలు పెంచేస్తున్నారని కొడాలి ఫైర్ అయ్యారు.

సరే ప్రజల మీద భారం పడకుండా సినిమా టిక్కెట్ల ధరలని ఏపీ ప్రభుత్వం కంట్రోల్ చేయాలని అనుకుంటుంది. మరి ఒక్క సినిమా టిక్కెట్ల ధరలని కంట్రోల్ చేస్తే జనం మీద భారం తగ్గుతుందా? పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆర్‌టిసి, ఇంటి పన్ను, చెత్త పన్ను…ఇసుక, వైన్స్, సిమెంట్…అబ్బో ఒకటి ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వాటిలపై ప్రభుత్వం భారం తగ్గించి అప్పుడు సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడితే బెటర్.

Discussion about this post