May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

కొడాలి సేమ్ స్క్రిప్ట్..వైసీపీకే రివర్స్..!

కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత..టి‌డి‌పి అధినేత చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టే నాయకుడు. అసలు బాబుని కొడాలి తిట్టినట్లు మరొక నాయకుడు తిట్టడు. అంటే బాబుని తిట్టడం కోసమే కొడాలి ఉన్నారా? అనే పరిస్తితి. ఇలా బాబుని కొడాలి తిట్టడం వల్ల వైసీపీకి లాభం, టి‌డి‌పికి నష్టం జరుగుతుందా? అంటే అబ్బే ఇదంతా రివర్స్ లో జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే కొడాలి నాని వల్లే టి‌డి‌పికి ఇంకా ప్లస్ అవుతుందని కొందరు వైసీపీ శ్రేణుల్లోనే డౌట్ ఉంది.

అసలు కొడాలి వైసీపీకి మంచి చేస్తున్నారా? లేక కోవర్టుగా మారి టి‌డి‌పికి మేలు చేస్తున్నారా? అనే డౌట్ కూడా ఉంది. అంటే కొడాలి పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి కొడాలి తాజాగా మీడియా ముందుకొచ్చారు. గత కొన్ని రోజులుగా వైసీపీ అమలు చేస్తున్న స్క్రిప్ట్ ఫాలో అయ్యారు. అది ఏంటంటే..ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు. దీంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే వారు చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపణలు చేస్తున్నారు.

విచిత్రం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బయటకొచ్చి టి‌డి‌పి తమకు పది కోట్ల ఆఫర్ ఇచ్చిందని స్క్రిప్ట్ ఫాలో అవ్వడం, దీని వల్ల వైసీపీకే రివర్స్ అవుతుంది. అదే స్క్రిప్ట్ ని కొడాలి చెప్పేశారు. పనిలో పనిగా ఎప్పటిలాగానే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అదే పాత కాన్సెప్ట్ చెప్పారు.

పైగా తమ నలుగురు ఎమ్మెల్యేలని లాక్కున్నారు కాబట్టి..వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పికి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. అయితే కొడాలి స్క్రిప్ట్ అడ్డంగా ఫెయిల్ అయిందనే చెప్పవచ్చు. ఈయన మాటలని నమ్మేవారు కనిపించడం లేదు. ఆఖరికి వైసీపీ వాళ్లే డౌట్ పదే పరిస్తితి. కొడాలి వల్ల వైసీపీకి ఒక్క ఓటు అదనంగా రాదని అంటున్నారు. పైగా టి‌డి‌పికి చెందిన నలుగురుని  జనసేన ఎమ్మెల్యేని వైసీపీ లాక్కుందని ఆ విషయం ప్రజలకు తెలుసని, అలాంటప్పుడు వైసీపీకి నెక్స్ట్ ఐదు సీట్లు మాత్రమే వస్తాయా? అని ప్రశ్నలు వస్తున్నాయి.మొత్తానికి కొడాలి వల్ల వైసీపీకి పావలా ఉపయోగం లేకపోగా, ఇంకా నష్టం జరిగేలా ఉంది.