ఈ మధ్య ఏపీ మంత్రివర్గంలో జరిగే మార్పులు గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి…మంత్రివర్గంలో మార్పులు గురించి ఊహించని విషయం చెప్పారు. 100 శాతం మంత్రులని పక్కనబెట్టేసి…జగన్ కొత్తవారిని మంత్రివర్గంలో తీసుకొనున్నారని బాలినేని చెప్పారు. జగనే స్వయంగా తనకు ఈ విషయం చెప్పారని మాట్లాడారు. సిఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మాట్లాడారు.

అంటే బాలినేని చెప్పిన ప్రకారం 100 శాతం మంత్రులు మాజీలు అయిపోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో ఫైర్ బ్రాండ్ మంత్రిగా ఉన్న కొడాలి నాని పదవి కూడా పోనుందని తెలుస్తోంది. అయితే కమ్మ వర్గంలో కీలకంగా ఉన్న కొడాలి…చంద్రబాబుపై ఏ స్థాయిలో విరుచుకుపడతారో అందరికీ తెలుసు. మరి కొడాలి సైడ్ అయితే, ఆయన ప్లేస్‌లో వచ్చే కమ్మ మంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

కొడాలి మాదిరిగా వారు బాబుపై విరుచుకుపడతారా? అనేది కూడా చూడాల్సి ఉంది. కొడాలిని తప్పిస్తే ఆ ప్లేస్‌లోకి రావడానికి పలువురు కమ్మ ఎమ్మెల్యేలు ఆసక్తిగా చూస్తున్నారు. కమ్మ వర్గానికి చెంది బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్ రావు, వసంత కృష్ణ ప్రసాద్, అన్నాబత్తుని శివకుమార్, అబ్బయ్య చౌదరీలు ఉన్నారు. కొడాలి నాని తప్పుకుంటే వీరిలో ఒకరికి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మర్రి రాజశేఖర్ లాంటి నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు.

కానీ మండలి రద్దు అంశం పెండింగ్‌లో ఉండటంతో ఎమ్మెల్సీలని మంత్రివర్గంలో తీసుకోవడం కష్టమే అని చెప్పొచ్చు. అటు కరణం బలరాం, వల్లభనేని వంశీలు జంపింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వారికి ఛాన్స్ ఉండకపోవచ్చు. నాని మినహా మిగిలిన ఐదుగురు కమ్మ ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన వారే…అలాంటప్పుడు జగన్ ఎవరికి అవకాశం ఇస్తారనేది క్లారిటీ లేదు.

Discussion about this post