గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి తిరుగులేదనే సంగతి తెలిసిందే. టీడీపీ కంచుకోటగా ఉన్న గుడివాడని తన అడ్డాగా మార్చేసుకుని ఏలుతున్నారు. ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కొడాలి దూసుకెళుతున్నారు. గత రెండు పర్యాయాలుగా వైసీపీ నుంచి గెలిచి సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉండటంతో గుడివాడలో కొడాలికి ఎదురులేకుండా పోయింది. ఇక్కడ టీడీపీ నాయకత్వం చాలా వీక్ అయిపోయింది. దీంతో గుడివాడలో కొడాలి వన్ మ్యన్ షో నడుస్తోంది.

అయితే ఇలా కొడాలి హవా నడుస్తున్న గుడివాడలో తెలుగు తమ్ముళ్ళు సైలెంట్‌గా దూసుకొస్తున్నారు. ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు యాక్టివ్‌గా లేకపోయినా సరే కింది స్థాయి క్యాడర్ మాత్రం గట్టిగానే పోరాడుతుంది. ఆ పోరాటం ఎలా ఉందో గత పంచాయితీ ఎన్నికల్లోనే అర్ధమైందని చెప్పొచ్చు. పంచాయితీ ఎన్నికల్లో గుడివాడలో తెలుగు తమ్ముళ్ళు వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. అసలు గుడ్లవల్లేరు మండలంలో దాదాపు 70 శాతం పంచాయితీలు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. అలాగే నియోజకవర్గం మొత్తం మీద టీడీపీ మంచి విజయాలే అందుకుంది. ఇక ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలని టీడీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే నామినేషన్లు వేసి నామమాత్రంగా పోటీలో ఉన్నారు. దీంతో ఆ స్థానాల్లో వైసీపీ హవా నడిచింది. ఒకవేళ టీడీపీ గట్టి పోటీ ఇస్తే పరిస్తితి వేరేగా ఉండేది. తాజాగా టీడీపీ పోటీ ఇస్తే ఎలా ఉంటుందో…ఒక పంచాయితీ ఎన్నిక రుజువు చేసింది. తాజాగా గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం పరిధిలోని పోలుకొండ పంచాయితీకి ఎన్నిక జరిగింది.

ఈ పంచాయితీలో ఊహించని విధంగా వైసీపీకి టీడీపీ చెక్ పెట్టేసింది. పోలుకొండ సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో విజయం సాధించారు. అంటే గుడివాడలో టీడీపీ బలం తగ్గలేదని దీని బట్టే అర్ధమవుతుంది. టీడీపీకి సరైన నాయకుడు దొరికితే గుడివాడలో కొడాలికి షాక్ ఇవ్వొచ్చు.
Discussion about this post