కొడాలి నాని….ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఈయన చుట్టూనే తిరుగుతున్నాయి…అయినా ఇప్పుడు అని కాదు ఎప్పుడూ ఈయన ఏపీ రాజకీయాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్. కాకపోతే మంత్రిగా మంచి పనిచేస్తున్నారని హైలైట్ అవ్వరు. జగన్‌కు రక్షకుడుగా…చంద్రబాబుకు శత్రువుగా హైలైట్ అవుతారు. నిజం చెప్పాలంటే బాబు రాజకీయ జీవితంలో ఏ ప్రత్యర్ధి తిట్టని విధంగా…కొడాలి నాని తిడుతున్నారు. బాబుని కొడాలి ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు.

అంటే తిట్టడం కోసమే మంత్రి పదవి అన్నట్లు పరిస్తితి ఉంది. ఇక ఈయన తిడితే చంద్రబాబుకు ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా? అంటే జనం అంతగా పట్టించుకోకపోవచ్చు. ఏదో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయని ఊరుకుంటున్నారు. అదే సమయంలో కొడాలి అలాంటి లాంగ్వేజ్ వాడటం వల్ల వైసీపీకి వచ్చేది కూడా ఏమి లేదని సొంత పార్టీ కార్యకర్తలే మాట్లాడుకునే పరిస్తితి కనిపిస్తోంది.

కొందరు కార్యకర్తలు మాత్రం కొడాలి మాట్లాడుతున్న లాంగ్వేజ్‌పై కాస్త అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే వారు బహిరంగంగా బయట పెట్టలేకపోతున్నారు. లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఏదో వల్లభనేని వంశీ విషయంలో వైసీపీ నేతలు బయట పడ్డారు గాని, కొడాలి విషయంలో బయట పడలేకపోతున్నారు. ఎందుకంటే కొడాలి మంత్రిగా ఉన్నారు కాబట్టి. అయితే సుబ్బారావు గుప్తా లాంటి వారు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కొడాలి నాని లాంటి వారి వల్ల ఓట్లు రావడం పక్కనబెడితే..ఓట్లు పోయేలా ఉన్నాయని అంటున్నారు.

అయితే ఇదే డౌట్ కొందరు వైసీపీ శ్రేణుల్లో కూడా ఉందని తెలుస్తోంది. అసలు కొడాలి..చంద్రబాబుకు కోవర్టుగా పనిచేస్తున్నారా? అనే డౌట్ కూడా వ్యక్తపరుస్తున్నారట. ఇలా బూతులు మాట్లాడుతూ…తమ పార్టీకి ఇంకా డ్యామేజ్ జరిగేలా చేస్తున్నారని, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందనే అనుమాన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ వాళ్ళు ఎన్ని బూతులు తిట్టిన పోలీసులు పట్టించుకోరు అని, కానీ టీడీపీ నేతలు ఒక్క మాట అంటే అరెస్ట్‌లు చేసేస్తారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. మొత్తానికైతే కొడాలి నాని….వైసీపీని లేపుతున్నారో లేక కింద పడేస్తున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు.

Discussion about this post