వైసీపీలో ఎక్కువ హైలైట్ అయ్యే మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నానినే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఆయన మంత్రి అయిన దగ్గర నుంచి కొడాలి ఏపీ రాజకీయాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గానే ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి…ఆయన ఎలా హైలైట్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ఏదో మంత్రిగా అద్భుతమైన పనితీరు కనబర్చి, ప్రజలకు గొప్పగా సేవలు చేసి మాత్రం మంత్రి హైలైట్ అవ్వడం లేదని విశ్లేషకులు మొహమాటం లేకుండా చెబుతున్నారు.

అంటే ఇంకా ఎలా హైలైట్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్‌లని బూతులు తిడుతూ ఫుల్‌గా హైలైట్ అవుతున్నారు. ఇక మంత్రిగా నాని డ్యూటీ అదే అన్నట్లు పరిస్తితి ఉంది. సరే రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం సహజమే. కానీ ఇలా బూతులు తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే…అది జనాలకే వదిలేయాలి. రాజకీయంగా ఎవరైనా తప్పులు చేస్తే..ఆ తప్పులని ఎత్తి చూపిస్తూ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. అలా కాకుండా అడ్డగోలుగా తిట్టేయడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదని చెప్పొచ్చు.

ఇప్పుడు కొడాలి నాని కూడా చంద్రబాబుని తిట్టడం వల్ల వైసీపీకి వచ్చే లాభం లేదు..అలా అని టీడీపీకి జరిగే నష్టం లేదని అంటున్నారు. పైగా వైసీపీకి కాస్త డ్యామేజ్ జరుగుతుందనే అనుమానం వస్తుంది. ఎంత కాదు అనుకున్న గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ బలం తగ్గిన మాట వాస్తవం. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు.

అదే సమయంలో కొందరు నేతలు అడ్డగోలుగా చంద్రబాబుని తిట్టడం వల్ల మరింత బొక్క పడేలా ఉంది. దాని వల్ల చంద్రబాబుపై సానుభూతి పెరిగి, రివర్స్‌లో వైసీపీకే నష్టం జరిగేలా ఉంది. తిట్టే నేతలకు ఏం కాకపోవచ్చు గాని, వారి వల్ల పార్టీకి మాత్రం నష్టం జరుగుతుందని పార్టీలో ఉండే కార్యకర్తలే లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కొడాలి వల్ల వైసీపీకి నష్టం జరిగేలా ఉందని అనుకుంటున్నారు.

Discussion about this post