కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం అంటే అసలు టీడీపీకి కలిసిరాని నియోజకవర్గం అని చెప్పేయొచ్చు. అసలు చెప్పాలంటే కోడుమూరుని టీడీపీ కౌంట్‌లో లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి అసలు పట్టు లేదు. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకులు లేరు. ముందు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరిన సందర్భాలు లేవు. ఏదో 1985లో ఒకసారి గెలిచింది అంతే…మళ్ళీ అక్కడ పార్టీ గెలవలేదు. అసలు టీడీపీ క్యాడర్‌కు కూడా కోడుమూరు అంటే పెద్దగా అవగాహన ఉండదనే చెప్పాలి.

అయితే విచిత్రం ఏంటంటే…ఇంతకాలం కాంగ్రెస్, వైసీపీలే అక్కడ విజయం సాధించాయి. కానీ అక్కడ అభివృద్ధి పెద్దగా జరగలేదు. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధాకర్ ఉన్నారు…ఇటు వైసీపీ అధికారంలో ఉంది…అయినా సరే కోడుమూరులో అభివృద్ధి శూన్యం. ఏదో ప్రభుత్వ పథకాలు మాత్రం వస్తున్నాయి. అలాగే ఎమ్మెల్యే సైతం ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం కూడా తక్కువే. ఇక ఇంత నెగిటివ్ ఉన్నా సరే ఇక్కడి ప్రజలు జగన్ వైపే ఉన్నారు. కోడుమూరు ప్రజలు వైఎస్సార్ ఫ్యామిలీ పట్ల బాగా అభిమానంతో ఉంటారు. అందుకే టీడీపీకి ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు.

తమకు ఏం చేసినా..ఏం చేయకపోయినా అక్కడి ప్రజలు వైసీపీనే గెలిపించేలా ఉన్నారు. అంటే ఇక్కడ టీడీపీ పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. పైగా ఇంతవరకు ఇక్కడ సరైన నాయకుడు లేరు. ఎన్నిక ఎన్నికకు నాయకులు మార్చాల్సిన పరిస్తితి.

గత ఎన్నికల్లో టీడీపీ తరుపున బూర్ల రామాంజనేయులు పోటీ చేసి ఓడిపోయారు…ఓడిపోయాక ఆయన అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఆకెపోగు ప్రభాకర్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే ఇప్పుడుప్పుడే ఈయన ప్రజల్లోకి వెళుతూ వారి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈయనకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సపోర్ట్ ఉంది. కోట్లకు ఇక్కడ ఫాలోయింగ్ బాగానే ఉంది. కోట్లని నమ్ముకుని ప్రభాకర్ ముందుకెళుతున్నారు. ఇక్కడ టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత కోట్లదే. మరి ఆయన ఎంత వరకు పార్టీని లేపుతారో చూడాలి.

Discussion about this post