తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో భీమిలి కూడా ఒకటి….ఈ నియోజకవర్గంలో టీడీపీ అనేక సార్లు విజయం సాధించింది….మొదట నుంచి భీమిలిలో టీడీపీ హవా కొనసాగుతూనే ఉంది. అయితే గత ఎన్నికల్లోనే జగన్ గాలిలో భీమిలిలో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇక ఆయన ఇప్పుడు మంత్రిగా ఉండటంతో భీమిలిలో వైసీపీ హవా కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ టీడీపీ బలం తక్కువేమీ కాదు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నారు.

అటు టీడీపీ ఇంచార్జ్‌గా కోరాడ రాజబాబు పనిచేస్తున్నారు…కాపు వర్గానికి చెందిన రాజబాబుకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అయితే ఇక్కడ విషయం క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు ఇంచార్జ్‌గా కోరాడకే భీమిలి సీటు ఫిక్స్ చేస్తారా? లేదా? అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఈ సీటుపై కొందరు టీడీపీ సీనియర్ల చూపు ఉంది. అయితే 2014 నుంచి ఇక్కడ టీడీపీకి నిలకడైన నేత ఉండటం లేదు.

2014లో భీమిలిలో గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలోచ్చేసరికి గంటా భీమిలిని వదిలేసి…విశాఖ నార్త్ వచ్చి పోటీ చేసి గెలిచారు. దీంతో భీమిలిలో సబ్బం హరి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయారు. ఈ క్రమంలోనే కోరాడ రాజబాబుని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే ఇంచార్జ్‌గా కోరాడ బాగానే పనిచేసుకుంటున్నారు. కానీ ఈయనకే నెక్స్ట్ సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉంది.

మళ్ళీ భీమిలికి గంటా శ్రీనివాసరావు వస్తారని ప్రచారం జరుగుతుంది…విశాఖ నార్త్‌లో మళ్ళీ గంటాకు గెలిచే అవకాశాలు లేవు..అందుకే ఆయన భీమిలికి మారతారని ప్రచారం వస్తుంది. ఒకవేళ గంటా వస్తే కోరాడకు సీటు ఉండదు. అలా కాకుండా గంటాకు వేరే సీటు ఇస్తే, కోరాడకు భీమిలి సీటు దక్కవచ్చు. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే..భీమిలి ఆ పార్టీకే దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం కూడా ఉంది. మరి చూడాలి చివరికి భీమిలి సీటు ఎవరికి దక్కుతుందో?

Discussion about this post