గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కందుకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో వరుసగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. అయితే కందుకూరులో విషాద ఘటన జరగడం, తొక్కిసలాటలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోవడం, వారికి అండగా చంద్రబాబు నిలబడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత కావలి, కోవూరుల్లో సభలు నిర్వహించారు. ఈ రెండు చోట్ల కూడా భారీగా జనం తరలివచ్చారు.

అయితే ఇప్పటివరకు బాబు పర్యటించిన స్థానాలు వైసీపీ కంచుకోటలు..ఇప్పుడు బాబు పర్యటనలకు మంచి స్పందన రావడంతో ఆ స్థానాల్లో టీడీపీకి కాస్త ఊపు వచ్చిందని చెప్పవచ్చు. చివరిగా కోవూరులో జరిగిన రోడ్ షోకు, సభకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కోవూరులో టీడీపీకి పూర్వ వైభవం వచ్చే దిశగా వెళుతుంది. మొదట నుంచి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన స్థానం ఏదైనా ఉందంటే..అది కోవూరు మాత్రమే. ఇక్కడ టీడీపీ ఎక్కువసార్లే గెలిచింది. కానీ టీడీపీ తరుపున గెలిచింది నల్లపురెడ్డి ఫ్యామిలీ. ఇక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళి 2012 ఉపఎన్నికలో గెలవడం జరిగింది.

2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరుపున పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు..మళ్ళీ 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి గెలిచారు. అయితే అధికారంలో ఉండటంతో నల్లపురెడ్డి దూకుడుగా వెళుతున్నారు. ఇదే సమయంలో పొలంరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిని కోవూరు టీడీపీ ఇంచార్జ్ గా పెట్టారు. దినేష్ సైతం దూకుడుగానే పనిచేస్తున్నారు. బాబు రోడ్ షోని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఇదే ఊపుతో నల్లపురెడ్డికి చెక్ పెట్టాలని దినేష్ చూస్తున్నారు..కానీ రాజకీయాల్లో నల్లపురెడ్డి చాలా సీనియర్..అన్నీ అంశాలపై పట్టు ఉంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో ధిట్ట. మరి అలాంటి నాయకుడుని ఢీకొట్టి దినేష్..కోవూరు టీడీపీ వశమయ్యేలా చేయగలరో లేదో చూడాలి.

Leave feedback about this