అధికార వైసీపీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికార బలంతో ఇబ్బందులు పెడుతున్నా సరే..టీడీపీ నేతలు గట్టిగానే నిలబడుతున్నారు. అటు చంద్రబాబు సైతం పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు..పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపడుతున్నారు. అయితే బాబు చాలావరకు నియోజకవర్గాల్లో పార్టీని సెట్ చేశారు..కానీ కొన్ని స్థానాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఇటీవల వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి..ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. ఇదే క్రమంలో కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని కూడా ఖరారు చేశారు. కానీ కొన్ని సీట్లలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇలా క్లారిటీ రాకపోవడం వల్ల నేతలు సీట్ల కోసం ఫైట్ చేస్తూ..గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. దీని వల్ల టీడీపీకే ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. అలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లలో టీడీపీలో ఇబ్బందులు ఉన్నాయి.

జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి..అందులో ఐదారు సీట్లు మినహా మిగిలిన సీట్లు దాదాపు ఫిక్స్. ఫిక్స్ అవ్వని స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అలాగే కొన్నిచోట్ల క్యాడర్‌లో కన్ఫ్యూజన్ ఉంది. కృష్ణాలో టీడీపీకి క్లారిటీ లేని సీట్లు వచ్చి..విజయవాడ వెస్ట్, కైకలూరు, గుడివాడ, గన్నవరం, తిరువూరు, నూజివీడు సీట్లు.

పొత్తు కోసం విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లు ఆపినట్లు తెలుస్తోంది. పొత్తు ఉంటే ఆ సీట్లు జనసేనకే. కానీ మిగిలిన సీట్లలో ఇంచార్జ్‌లు ఉన్నారు గాని..మరి కొందరు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. నూజివీడులో ఇంచార్జ్‌గా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు..కానీ ఈయనకు పోటీగా ఇద్దరు కమ్మ నేతలు ఉన్నారు. తిరువూరులో ఇంచార్జ్ దేవదత్..ఆయనకు పోటీగా మునయ్య ఉన్నారు. గుడివాడలో రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..ఆయనకు పోటీగా వెనిగండ్ల రాము, పిన్నమనేని బాబ్జీ ఉన్నారు. గన్నవరంలో బచ్చుల అర్జున్దు ఉన్నారు..అసలు ఈయన్ని తప్పించి కొత్త నేతని పెట్టాలని క్యాడర్ డిమాండ్ చేస్తుంది. ఇలా కొన్ని సీట్లలో కన్ఫ్యూజన్ ఉంది.

Leave feedback about this