2011లో వైసీపీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే…ఆ తర్వాత వైసీపీ కొన్ని ఉపఎన్నికలని ఎదురుకుని మంచి విజయాలని సాధించింది…ఇక ఆ పార్టీ రెండు సాధారణ ఎన్నికలని ఎదురుకుంది..2014, 2019 ఎన్నికలని ఫేస్ చేసింది…2014లో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన సీట్లు కొన్ని ఉన్నాయి..దాదాపు 60 పైనే సీట్లలో వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది.

అలా రెండు సార్లు గెలిచిన సీట్లలో మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ చూస్తుంది…అయితే ఈ సారి వైసీపీకి హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమేనా? అంటే ఏమో చెప్పలేని పరిస్తితి..2024 ఎన్నికలు వైసీపీకి అంత అనుకూలంగా ఉండేలా కనిపించడం లేదు. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ గట్టిగానే తగిలేలా ఉంది..,ముఖ్యంగా వరుసగా రెండుసార్లు గెలిచిన సీట్లలో వైసీపీ ఓడిపోవడం ఖాయమయ్యేలా ఉంది..ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టీడీపీ పుంజుకోవడం, అలాగే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం లాంటి అంశాలు వైసీపీకి బాగా మైనస్ అయ్యేలా ఉన్నాయి.

అలాగే కృష్ణా-గుంటూరు లాంటి జిల్లాల్లో అమరావతి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో వైసీపీకి హ్యాట్రిక్ కొట్టడం కష్టమయ్యే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..కృష్ణా జిల్లాకొస్తే పామర్రు, విజయవాడ వెస్ట్, నూజివీడు, తిరువూరు, గుడివాడ లాంటి స్థానాల్లో వరుసగా రెండుసార్లు గెలిచింది…కానీ మూడోసారి వచ్చి ఒక్క గుడివాడ తప్ప, మిగిలిన చోట్ల గెలిచేలా లేదు.

అటు గుంటూరు జిల్లాకొస్తే…గుంటూరు ఈస్ట్, మాచర్ల, నరసారావుపేట, మంగళగిరి, బాపట్ల స్థానాల్లో వైసీపీ రెండుసార్లు గెలిచింది. అయితే ఈ సారి మంగళగిరిలో వైసీపీ ఓటమి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది..అలాగే బాపట్ల, గుంటూరు ఈస్ట్‌ల్లో కూడా వైసీపీకి ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది. ఇక మాచర్ల, నరసారావుపేటల్లో మాత్రమే వైసీపీకి మళ్ళీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఇంకా వ్యతిరేకత పెరిగితే వాటిల్లో కూడా గెలవడం కష్టమే అంటున్నారు.

Discussion about this post