మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు…టీడీపీలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే…నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ నేతలని రెడీ చేస్తున్నారు..ఈ క్రమంలోనే పార్టీలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇక రెండేళ్ల క్రితం వరకు ఉన్న జిల్లా అధ్యక్ష వ్యవస్థని తీసేసి…పార్లమెంట్ అధ్యక్షులని పెట్టిన విషయం తెలిసిందే..ఇలా పార్లమెంట్ అధ్యక్షులని పెట్టడం టీడీపీకి బాగా బెనిఫిట్ అయింది…ఇంకా పార్టీ బలపడటానికి ఉపయోగపడింది.

25 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న టీడీపీ అధ్యక్షులు ఇప్పుడు బాగానే పనిచేసుకుంటున్నారు…అయితే కొందరు బాగా దూకుడుగా ఉంటే…కొందరు కాస్త వెనుకబడి ఉన్నారు…వారు కూడా లైన్‌లో పడితే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి…విజయవాడకు నెట్టెం రఘురాం అధ్యక్షుడుగా ఉండగా, మచిలీపట్నంకు కొనకళ్ళ నారాయణ అధ్యక్షుడుగా ఉన్నారు. వీరిలో నెట్టెం బాగా దూకుడుగా ఉంటుంటే..కొనకళ్ళ కాస్త సైలెంట్‌గా ఉంటున్నారు.


తమ పార్లమెంట్ స్థానాల పరిధిలో పార్టీని బలోపేతం చేయడంలో నెట్టెం ముందున్నారు. ఆయన పదవి వచ్చిన దగ్గర నుంచి దూకుడుగానే పనిచేస్తున్నారు…ఎప్పటికప్పుడు అసెంబ్లీ స్థానాల్లో తిరుగుతూ, ఇంచార్జ్‌లని సమన్వయం చేసుకుని, పార్టీని బలోపేతం చేయడంలో ముందున్నారు. ఈ రెండేళ్లలో విజయవాడ పరిధిలో ఉన్న నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ తూర్పు, సెంట్రల్ లాంటి స్థానాల్లో టీడీపీని లీడ్‌లోకి తీసుకొచ్చారు. అలాగే విజయవాడ వెస్ట్, తిరువూరు స్థానాల్లో కూడా పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇటు మచిలీపట్నం పరిధిలో మాత్రం కొనకళ్ళ అంత ఎఫెక్టివ్‌గా మాత్రం పనిచేయాలకపోతున్నారు…ఏదో ఇంచార్జ్‌లు కష్టపడి పనిచేసుకోవడం, వైసీపీపై కాస్త వ్యతిరేకత రావడం వల్ల కొన్ని స్థానాల్లో టీడీపీ పరిస్తితి మెరుగ్గా ఉంది. అయితే పెనమలూరు, పెడన, మచిలీపట్నం స్థానాల్లో పార్టీ పరిస్తితి మెరుగ్గా కనిపిస్తోంది. అవనిగడ్డ, పామర్రుల్లో పార్టీ ఇంకా పికప్ అవ్వాలి…గుడివాడ, గన్నవరంల్లో పార్టీ పరిస్తితి దారుణంగానే ఉంది. మొత్తానికి అధ్యక్షుడుగా నెట్టెం సక్సెస్ అవ్వగా, కొనకళ్ళ వెనుకబడ్డారు.

Discussion about this post