నిన్న మొన్నటి వరకు అన్యోన్యంగా ఉన్న సీనియర్ రాజకీయ కుటుంబం ధర్మాన ఫ్యామిలీలో.. రాజకీయ కుంపట్లు ముసురుకున్నాయి. అన్న ధర్మాన కృష్ణదాస్ నిర్వహించిన రెవెన్యూ శాఖ బాధ్యతలను తమ్ము డు ధర్మాన ప్రసాదరావు.. తాజాగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ధర్మాన ప్రసాదరావుకు పద వి ఇవ్వడాన్ని కృష్ణదాస్ స్వాగతిస్తున్నా.. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించడం పై మాత్రం ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు.

నిజానికి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి కూడా కృష్ణదాస్ రాలేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని..ఆయన సందేశం పంపించారు. అయితే.. తర్వాత.. ధర్మాన ప్రసాదరావు.. తన సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు.. అనుచరులు నిర్వహించిన ఆత్మీయసన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి కూడా కృష్ణదాస్ రాలేదు. పైగా.. ఆయనకు ఒంట్లో బాగోలేకపోతే.. ఇటీవల కాలంలో యాక్టివ్‌గా పాలిటిక్స్ చేస్తున్న ఆయన కుమారుడినైనా .. పంపించాలి కదా.. కానీ, అలా కూడా చేయలేదు.

దీంతో ధర్మాన ఇంట్లో రాజకీయ కుంపట్లు ముసురుకున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు తన అన్నగారే నిర్వహించిన రెవెన్యూ శాఖపై ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి పెరిగిపో యిందని.. అవినీతి లేని పాలన అందిస్తామని..చెప్పారు. ఈ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి. ఇదిలావుంటే.. వీరి వ్యతిరేక వర్గం..అప్పుడే.. పార్టీలో వ్యూహాత్మకంగా చిచ్చు పెట్టడం ప్రారంభించింది. పాత చెవులు కన్నా.. కొత్త కొమ్ములు వాడి! అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

అంటే.. ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా విఫలమయ్యారని.. ఇప్పుడు వచ్చిన ప్రసాదరావే.. ఈ విషయాన్ని ఒప్పుకున్నారని.. అర్ధం వచ్చేలా.. ఒక సీనియర్ నేత.. కనుసన్నల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈప్రచారం… ధర్మాన అనుచరులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. అయితే.. అటు కృష్ణదాస్ కానీ.,. ఇటు ప్రసాదరావు కానీ.. ఎవరూ కూడా.. దీనిపై రియాక్ట్ కాలేదు. అయితే.. ఇద్దరూ కలసి కూడా మాట్లాడుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post