ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడమే కాకుండా…సొంత పార్టీ నేతలే విమర్శలు చేసే పరిస్తితి వచ్చింది. రాష్ట్రంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి. అసలు వారు బహిరంగంగానే…వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని, అలాగే అసలైన కార్యకర్తలని పట్టించుకోవడం లేదని వాపోయిన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై…సొంత పార్టీ నేతలు ఎలాంటి విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. దూలం దాదాపు రూ.250 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని సొంత పార్టీ నేతలు ఆరోపించారు. అలాగే కొల్లేరులో బినామీలకు వందల ఎకరాల చెరువులు ఇచ్చారని, ఇక అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లో వందల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆరోపించింది.

అయితే ఇలా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిపోయాయి. ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే కైకలూరులో ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు ఫుల్ నెగిటివ్ వస్తుండటంతో సొంత పార్టీ కార్యకర్తలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఎమ్మెల్యే వర్గం మాత్రం…తమ నాయకుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కాస్త కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయినట్లు కనిపిస్తోంది.

పైగా వచ్చే ఎన్నికల్లో దూలంకు మళ్ళీ సీటు ఇస్తే..ఖచ్చితంగా ఓడిస్తామని సొంత పార్టీ నేతలే చెప్పే పరిస్తితి. ఇలాంటి పరిస్తితుల నేపథ్యంలో మళ్ళీ కైకలూరు సీటు గాని దూలంకు ఇస్తే వైసీపీకే ఇబ్బంది అయ్యేలా ఉంది. 2014లోనే కొన్ని కేసులు ఉండటం వల్ల పోటీ చేయడం కుదరలేదు..2019లో పోటీ చేసి ఎలాగోలా గెలిచారు. మళ్ళీ 2024లో సీటు పోయేలా ఉంది. మరి చూడాలి ఈ సారి దూలం పరిస్తితి ఎలా ఉంటుందో?

Discussion about this post