తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా ఒకటి..ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధిస్తూ వచ్చేది..కానీ గత ఎన్నికల్లోనే టిడిపికి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో 16 సీట్లు ఉంటే అందులో రెండు సీట్లు మాత్రమే గెలిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని సత్తా చాటాలని టిడిపి చూస్తుంది. ఆ దిశగానే నేతలు పనిచేస్తున్నారు.
అయితే జిల్లాలో టిడిపికి ప్రస్తుతం బలం పెరిగింది..అదే సమయంలో చంద్రబాబు సైతం చాలా వరకు అభ్యర్ధులని ఫిక్స్ చేసేశారు. గతంలో మాదిరిగా ఎన్నికల వరకు చూడకుండా ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసి..దూకుడుగా ఉంటున్నారు. చాలా స్థానాల్లో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. కానీ కొన్ని స్థానాల్లో ఇంకా క్లారిటీ రావడం లేదు. దాని వల్ల టిడిపిలో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే జనసేనతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు ఆ పార్టీకి వదలాలి.

కైకలూరు, విజయవాడ వెస్ట్ లాంటి సీట్లు జనసేనకు ఇచ్చే ఛాన్స్
ఉంది. అందుకే వాటిని వదిలిపెట్టారని అనుకోవచ్చు. కానీ తిరువూరు, నూజివీడు, గుడివాడ, గన్నవరం లాంటి సీట్లలో అభ్యర్ధులు ఖరారు కాలేదు. పైగా ఎక్కువమంది నేతలు పోటీ పడుతున్నారు. తిరువూరులో వాసం మునయ్య, దేవదత్ సీటు కోసం పోటీ ఉంది. నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు కమ్మ నేతలు సీటు కోసం చూస్తున్నారు.
గుడివాడలో రావి వెంకటేశ్వరరావుతో పాటు వెనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ సీటు కోసం పోటీ పడుతున్నారు. గన్నవరం సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు..కానీ ఇంతవరకు ఆ సీటులో ఎవరు నిలబడతారో తెలియడం లేదు. అయితే ఎన్నికల వరకు ఎదురు చూడకుండా త్వరగా ఈ సీట్లు ఫిక్స్ చేస్తే టిడిపి శ్రేణులు దూకుడుగా పనిచేయడానికి ఉంటుంది. అలా కాకుండా ఏ నాయకుడు వైపు వెళ్లాలో అర్ధం కాకుండా ఉంటుంది. దీని వల్ల టిడిపికే నష్టం.
