ఆయన కీలక శాఖకు మంత్రిగా ఉన్నారు. పైగా.. ఇతర పార్టీల నుంచి తన కులం వారిని ఏమార్చో.. మార్చో .. ఏదైనా చేసో.. వైసీపీలోకి చేరుస్తుంటారు. దీంతో వైసీపీలో ఆయన జంప్ జిలానీలను మేనేజ్ చేసే మం త్రిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన ఈయన ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే.. ఇంత వరకు బాగానేఉంది. కానీ, ఈయన సొంత సామాజికవ ర్గమే.. ఇప్పుడు ఈయనకు ఎదురు తిరుగుతోంది. ఆయనను మంత్రి పదవి నుంచి ఎంత తొందరగా దింపేస్తారా? అని ఎదురు చూస్తోంది.

అంతేకాదు.. ఈయన వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని.. బాహాటంగానే ఈ వర్గం విమర్శలు చేస్తోంది. “ప్రతిదానికీ కమీషన్లు. ప్రతి విషయంలోనూ.. ఆమ్యామ్యాలు.. ఎక్కడ నుంచి తెస్తాం! మేం కూడా వ్యాపారాలు లేక తీవ్రస్థాయిలో నష్టపోతున్నాం. మా కులం నాయకుడని.. మాకు ఏదైనా చేస్తారని.. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ, మాకే ఆయన ఎసరు పెడుతున్నారు“ అని వ్యాపార వర్గాలసంఘాలు లబోదిబో మంటున్నాయి. అంతేకాదు… ఈ మంత్రి గారి సోదరుడు కూడా నెల మామూళ్ల కోసం.. వ్యాపారస్తులను ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు జిల్లాలోని ప్రధాన నగరంలో జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే.. జగన్ దగ్గర మంచి మార్కులు ఉండడం.. పార్టీలో వలసలను ప్రోత్సహించడం.. చేస్తుండడంతో ఆయనపై నేరుగా.. ఎవరూ ఫిర్యాదులు చేసేందుకు సాహసించడం లేదు. కానీ.. అవినీతి మాత్రం జోరుగా సాగుతోందని.. సదరు మంత్రి చూసేశాఖలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అధికారుల నుంచి కింది స్తాయిలో ఉద్యోగులు వరకు తమకు బదిలీలు కావాలన్నా.. పనులు కావాలన్నా.. ముట్టజెప్పందే ఏదీ ముందుకు సాగడం లేదని.విమర్శలు వస్తున్నాయి.

అయితే.. ఈ విషయం తాడేపల్లి వర్గాలకు తెలుసోలేదో.. అని అంటున్నారు. కానీ, మంత్రిపై మాత్రం విమర్శలు ఆగడం లేదు. ఆయన పద్ధతి కూడా మార్చుకోవడం లేదు. దీంతో ఎప్పుడు మంత్రి వర్గం మారుతుందా? ఈయన ఎప్పుడు.. బయటకు వస్తారా? అని అందరూ ఎదురు చూస్తుండడం గమనార్హం. మొత్తానికి దక్కకదక్కక దక్కిన పదవిని అడ్డు పెట్టుకుని ఇలాంటి పేరు తెచ్చుకోవడంపై.. మంత్రి అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

Discussion about this post