రాజకీయాల్లో అదృష్టం అన్నిసార్లు దక్కదనే చెప్పాలి…ఏదో ఒకటి రెండు సార్లు మాత్రమే లక్ ఉంటుంది…మిగిలిన అన్నీ సార్లు కష్టపడి పనిచేసి, ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు…అలా కాకుండా ఏదో అదృష్టం కొద్ది విజయాలు అందుకుని, ప్రజలకు సరిగ్గా సేవ చేయకపోతే..వారిని ప్రజలే గద్దె దించుతారని చెప్పొచ్చు…ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలని కూడా ప్రజలే గద్దె దింపేలా ఉన్నారు.

గత ఎన్నికల్లో చాలామంది జగన్ గాలిలో గెలిచేశారని చెప్పొచ్చు…ప్రజలు కేవలం జగన్ ని ఒక్కసారి చూడాలని చెప్పి.. వైసీపీకి ఓట్లు వేసేశారు..దీంతో వైసీపీకి భారీగా సీట్లు వచ్చేశాయి. ఇక టీడీపీ కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాల్లో కూడా అదే పరిస్తితి…పూర్తిగా ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో 16 సీట్లలో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది…టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిలో…ఒకరు వైసీపీ వైపుకు వచ్చేశారు. దీంతో వైసీపీ బలం 15 కు చేరుకుంది. ఇలా జిల్లా మొత్తం వైసీపీ అండర్ లోకి వెళ్లింది.

మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా…జిల్లాలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? అంటే లేవనే చెప్పాలి…టీడీపీ హయాంలోనే జిల్లాలో అభివృద్ధి జరిగింది…ఇప్పుడు అదేం లేదు…ఎప్పటిలాగానే ప్రభుత్వ పథకాలు మాత్రం అందుతున్నాయి. అలాగే జగన్ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు పెంచేసింది. దీంతో ప్రజలపై భారం పెరిగింది. ఇక ఎమ్మెల్యేలు సైతం ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టమైపోతుంది.

వైసీపీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల దాదాపు..10 మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు…ఇందులో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు…ఇక వారు మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న సీనియర్లలో..జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను, విజయవాడ సెంట్రల్-మల్లాది విష్ణు, విజయవాడ వెస్ట్-వెల్లంపల్లి శ్రీనివాస్, పెనమలూరు-పార్థసారథి, మచిలీపట్నం-పేర్ని నాని, పెడన-మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఇక కొడాలి నాని, వంశీ, రక్షణనిధి, మేకా ప్రతాప్ పరిస్తితి కూడా పెద్దగా ఏమి బాగోలేదు. మొత్తానికైతే కృష్ణాలో వైసీపీ సీనియర్లకు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.

Discussion about this post