గత కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే..టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరిగింది…ఇక ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీని నిలువరించడం సులువు అవుతుందని విశ్లేషణలు కూడా వచ్చాయి…అలాగే పొత్తు గురించి ఇటు చంద్రబాబు, అటు పవన్ సైతం స్పందించారు…పరోక్షంగా పొత్తు పెట్టుకోవడానికే ఇద్దరు సుముఖంగా ఉన్నారని అర్ధమైంది..కాకపోతే పొత్తు విషయంలో ఎవరి డిమాండ్లు వారికి ఉన్నాయి.

ఇదే సమయంలో ఇటీవల పవన్…ఇంతకాలం తాము తగ్గమని, ఇప్పుడు మీరే తగ్గాలని చెప్పి టీడీపీకి పరోక్షంగా సూచించారు…అలాగే జనసేన శ్రేణులైతే ఏకంగా పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు తమది పెద్ద పార్టీ అని, పైగా 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న తాము..6 శాతం ఓట్లు ఉన్న పవన్ ని సీఎం అభ్యర్ధిగా ఎలా ప్రకటిస్తామని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అసలు ఒక్క శాతం ఓట్లు లేని బీజేపీనే..పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించడం లేదని, అలాంటప్పుడు తమని ఎలా డిమాండ్ చేస్తారని చెప్పి అంటున్నాయి.

అవసరమైతే ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతామని అంటున్నారు…జనసేన కలిస్తే కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని, కానీ జనసేన లేకుండా గెలిచే సత్తా తమకు ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు పొత్తుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు…ఎవరికి వారు సింగిల్ గానే సత్తా చాటాడానికి సిద్ధమవుతున్నారు..ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది…అలాగే టీడీపీ నేతలు కూడా పుంజుకున్నారు…ఇక కృష్ణాలో జనసేన పెద్దగా పికప్ అయినట్లే కనిపించడం లేదు.

అయితే గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల…పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, కైకలూరు, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, వెస్ట్ సీట్లలో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది…ఇక ఈ సారి మాత్రం జనసేన సపోర్ట్ చేయకపోయినా సరే ఈ సీట్లలో గెలిచే సత్తా టీడీపీకి వచ్చినట్లు కనిపిస్తోంది. కాకపోతే జనసేన పొత్తు ఉంటే టీడీపీకి భారీ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి పొత్తు ఉంటుందో లేదో.

Discussion about this post