రాజకీయాల్లో సమయం బట్టి వ్యూహాలు మార్చుకుని ముందుకెళ్లాలి. అప్పటికప్పుడు ఉండే రాజకీయ పరిస్తితులని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైన సక్సెస్ అవుతారు. ఈ విషయంలో సీఎం జగన్ ఎప్పుడు ముందే ఉంటారని చెప్పొచ్చు. సమయాన్ని బట్టి వ్యూహం మార్చి ముందుకెళ్తారు. ఇక వచ్చే ఎన్నికల్లో పరిస్తితులని జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారితే అందుకు తగ్గట్టు అభ్యర్ధులని కూడా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అవసరమైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కనబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా టీడీపీ-జనసేన కాంబినేషన్ సెట్ అయితే అందుకు తగ్గట్టుగా వ్యూహాలు అమలు చేయాలి. ఈ పరిణామాలని బట్టి చూస్తే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు తమ సీట్లని త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని చోట్ల సీట్లు మార్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

దీని బట్టి చూసుకుంటే కృష్ణా జిల్లాలో కూడా ఎవరి సీట్లైన మార్చే అవకాశం ఉందా? అంటే ఆ అవసరం పెద్దగా వచ్చే ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారినే నెక్స్ట్ ఎన్నికల బరిలో మళ్ళీ నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక సీటు కూడా మారే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. ఎలాగో మంత్రులుగా కొడాలి నాని…గుడివాడ, పేర్ని నాని…బందరు, వెల్లంపల్లి శ్రీనివాస్..విజయవాడ వెస్ట్ సీట్లలో ఎలాంటి మార్పు రాదు.



ఇక పెడనలో జోగి రమేష్, పామర్రులో అనిల్, అవనిగడ్డలో సింహాద్రి రమేష్, మైలవరంలో వసంత, నందిగామలో జగన్ మోహన్, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, తిరువూరులో రక్షణనిధి, నూజివీడులో మేకా ప్రతాప్‌ల సీట్లలో కూడా మార్పు ఉండదు.

ఇక గన్నవరంలో వల్లభనేని వంశీకి, విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్‌కు సీట్లు ఫిక్స్ అయినట్లే. విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణు, పెనమలూరులో పార్థసారథి, కైకలూరులో దూలం నాగేశ్వరరావుల సీట్ల విషయంలో కూడా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం కనిపించడం లేదు.











Discussion about this post