చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం బాబు అడ్డాగా ఉంటూ వస్తున్న కుప్పం కోటలో ఇప్పుడు సీన్ మారింది…వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి…టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. పూర్తిగా వైసీపీ హవా నడిచేలా మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలు రచించుకుంటూ వెళ్లారు…అలాగే సక్సెస్ కూడా అయ్యారు. దీంతో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో కుప్పంలో పూర్తిగా వైసీపీ హవా నడిచింది.

అలాగే కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ సత్తా చాటింది. దీంతో కుప్పంలో బాబు పని అయిపోయిందని చర్చలు మొదలయ్యాయి. ఇక బాబు కుప్పం వదిలేసి వెళ్లిపోతారని చర్చలు వచ్చాయి. కానీ కుప్పంని వదిలే ప్రసక్తి లేదని బాబు ఫిక్స్ అయ్యారు. గతంలో అంటే కుప్పం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకొని బాబు..ఇప్పుడు టైమ్ దొరికినప్పుడల్లా కుప్పం వెళ్లిపోతున్నారు. తాజాగా కూడా ఆయన కుప్పం టూర్‌లో నిమగ్నమయ్యారు. పార్టీ శ్రేణులని కలుపుకునిపోతూ ప్రజల్లో తిరుగుతున్నారు.

అలాగే రానున్న రోజుల్లో వైసీపీకి చెక్ పడేలా చంద్రబాబు సరికొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు. యువత ఓట్లు ఆకట్టుకునేలా సరికొత్త ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పటివరకు కుప్పంలో సీనియర్లదే హవా…మొత్తం వారే చూసుకునే వారు. అయితే కొందరు సీనియర్లు ఒంటెద్దు పోకడలు వల్ల పార్టీకి నష్టం జరిగింది. దీంతో బాబు…సీనియర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీనియర్లని నమ్ముకొని తన పరువు పోగొట్టుకున్నానని, తాను వచ్చినప్పుడు నాయకులు షో చేస్తున్నారే తప్ప ప్రజల్లో ఉండటం లేదని, మీ చేష్టల వల్లే ప్రజలు మనకు దూరమవుతున్నారని చెప్పి చంద్రబాబు ఫైర్ అయ్యారు.

అలాగే ప్రజల్లో ఉన్న నాయకులనే తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. అలాగే కుప్పంలో పార్టీలోకి యువత రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారని, వంద ఓటర్లకు ఒక యూత్ పర్సన్‌ని ఏర్పాటు చేస్తామని, వాలంటీర్లకి పోటీగా సేవా మిత్రలను ఏర్పాటు చేస్తానని, అధికారంలోకి వచ్చాక వాళ్లనే వాలెంటీర్లుగా మారుస్తామని బాబు ఛేప్పుకొచ్చారు. అంటే యువత ఓట్లని ఆకట్టుకోవడమే లక్ష్యంగా బాబు ఇలా ముందుకెళుతున్నారు. మరి ఈ వ్యూహం వల్ల బాబుకు ఎంత బెనిఫిట్ అవుతుందో చూడాలి.

Discussion about this post