మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసే అభ్యర్ధి ఫిక్స్ అయిపోయారు…వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ పోటీలో దిగనున్నారు…ఆ విషయం స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అయితే ఇప్పటివరకు కుప్పంలో బాబు ప్రత్యర్ధి మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది..పెద్దిరెడ్డి సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాగా, తాజాగా సినీ నటుడు విశాల్ బరిలో దిగుతారని కథనాలు మొదలయ్యాయి.



తమిళ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న విశాల్ తెలుగోడు అనే సంగతి అందరికీ తెలిసిందే..ఆయన తండ్రి జీకే రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వ్యక్తి. పైగా వైసీపీతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయని తెలిసింది. దీంతో విశాల్ తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి బరిలో దిగుతారని వార్తలు వచ్చాయి. వైసీపీ తరుపున నిలబడతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నడుస్తుండగానే..పెద్దిరెడ్డి కుప్పంలో పోటీ చేసే అభ్యర్ధిపై క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ భరత్ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పేశారు.

భరత్ తండ్రి చంద్రమౌళి..వరుసగా వైసీపీ నుంచి పోటీ చేసి చంద్రబాబుపై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోయారు..దీంతో ఆయన వారసుడుగా భరత్ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే జగన్..భరత్ కు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనే వైసీపీ నుంచి పోటీకి దిగుతున్నారు.

అయితే కుప్పంలో చంద్రబాబుని నిలువరించడం భరత్ కు సాధ్యమవుతుందా? అంటే బాబుని నిలువరించడం కాస్త కష్టమని చెప్పొచ్చు…1989-2019 వరకు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న బాబుని ఓడించడం ఈజీ కాదు. ఆ మధ్య స్థానిక ఎన్నికల్లో వైసీపీ పై చేయి సాధించిన…సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి కుప్పం ప్రజలు బాబు వైపే నిలబడతారు…కాబట్టి కుప్పంలో బాబుని ఓడించడం అనేది వైసీపీకి సులువు కాదు…ఒకవేళ విశాల్ బరిలో దిగిన సరే బాబుని నిలువరించడం కష్టం.



Discussion about this post