May 31, 2023
ap news latest AP Politics

కుప్పంలో బాబుని ఓడిస్తా..పెద్దిరెడ్డికి కష్టమే.!

గత మూడు రోజులుగా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో బాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడుగడుగున బాబు పర్యటనకు అడ్డుపడ్డారు. చివరికి బాబు పాదయాత్ర ద్వారా కుప్పంలో ఇంటింటికి వెళ్లారు. అయితే జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాలని తిరగనివ్వకుండా చేస్తున్నారని, కానీ ఈ జీవో వైసీపీ వాళ్ళకు వర్తించడం లేదని, వైసీపీ నేతలు రోడ్లపై యధేచ్చగా ర్యాలీలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.

అలాగే తన నియోజకవర్గం కుప్పంపై ఫోకస్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం వార్నింగ్ ఇచ్చారు..దమ్ముంటే తనని కుప్పంలో ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాబు సవాల్ చేశారు. అటు పెద్దిరెడ్డి సైతం కుప్పంలో బాబుని ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో అందరికీ తెలిసిందే. అధికార బలం ఉపయోగించి..అక్కడ టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు లాగారు. పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ వన్‌సైడ్‌గా గెలిచింది. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం కైవసం చేసుకుంటామని పెద్దిరెడ్డి సవాల్ చేస్తున్నారు.

ఇటు బాబు కూడా అలెర్ట్ అయ్యి..కుప్పంలో టీడీపీని మళ్ళీ గాడిలో పెట్టేవిధంగా ముందుకు వెళుతున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్తితులు చూస్తే..అధికార బలంతో వైసీపీ హడావిడి చేసిన..బాబుదే ఆధిక్యం కనబడుతుంది. ప్రస్తుతానికి జనం వైసీపీకి భయపడి బయటకు రావడం లేదని, కానీ ఎక్కువ శాతం ప్రజలు బాబు వైపే ఉన్నారని తెలుస్తోంది.

నెక్స్ట్ ఎన్నికల్లో బాబుకు గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువే వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అక్కడ బాబుని ఓడించడం పెద్దిరెడ్డికి కష్టమని అంటున్నారు. 

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video