ఇప్పుడు దొంగ ఓట్లు ఏపీలో బాగా కామన్ అయిపోయినట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడొక చోట ఎన్నిక జరిగితే…అక్కడ చుట్టూ పక్కల ఉండే ఓటర్లని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేస్తున్నారు. అయితే ఈ దొంగ ఓట్లు వేయించే కార్యక్రమం ఎవరు చేస్తున్నారనేది అందరికీ క్లారిటీ ఉంది. కానీ తాజాగా కుప్పంలో గెలవడానికి వైసీపీ అనేక ఎత్తులు వేస్తున్న విషయం తెలిసిందే. కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే దిశగా ముందుకెళుతుంది.

అందుకు వైసీపీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో అందరికీ తెలుసని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కాకపోతే ఆ కార్యక్రమాలు రివర్స్‌లో టీడీపీపై నెట్టేసి తెలివిగా వైసీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. దీనికి వైసీపీ అనుకూల మీడియా మనస్సాక్షి లేకుండా కథనాలు వేస్తూ…అడ్డగోలుగా టీడీపీపై విషప్రచారం చేస్తుందని చెబుతున్నారు. ఈ మధ్య ఆ అనుకూల మీడియా కుప్పం గురించి వరుసపెట్టి కథనాలు వేస్తుందని, వైసీపీ చేసే పనులని ముందే టీడీపీ చేసినట్లు రాసేసి…ఆ తర్వాత ఆ పనులు వైసీపీ చేసేస్తుందని అంటున్నారు.

మొదట కుప్పంలో టీడీపీ రౌడీయిజం చేస్తుందని తెగ కథనాలు వేసిందని, ఇక రౌడీయిజం చేసేది ఎవరో అందరికీ క్లారిటీ ఉందని అంటున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్‌లు ఓటమి భయంతో కుప్పంలో డబ్బులు, మద్యం పంచుతున్నారని, వైసీపీ అభ్యర్ధులని, నాయకులని, వాలంటీర్లని బెదిరిస్తున్నారని పిచ్చి పిచ్చి రాతలు రాసిందని గుర్తు చేస్తూ….అసలు డబ్బులు విచ్చలవిడిగా పంచేది ఎవరు…..మద్యం ఇచ్చేది ఎవరు…ఇంకా బెదిరింపులకు పాల్పడేది ఎవరు అనేది కూడా ప్రజలకు తెలుసని చెబుతున్నారు.

ఇక చివరిగా టీడీపీకి ఓటమి భయంతో పక్కనే బెంగళూరు నుంచి దొంగ ఓటర్లని తీసుకొస్తుందని, వారిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి రెడీ అయిందని అస్సాక్షి కథనాలు వచ్చాయని, కానీ ఇక్కడే ట్విస్ట్ ఉందని వైసీపీ చేయబోయే పనిని ముందే టీడీపీ మీద తోయడానికి ప్లాన్ చేశారని, అంటే కుప్పంలో వైసీపీ దొంగ ఓట్లు వేయించడానికి రెడీ అయిందని, ఎలాగో తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో అదే పనిచేశారని, ఇప్పుడు అదే కార్యక్రమం చేయడానికి రెడీ అయ్యారని చెబుతున్నారు.

Discussion about this post