ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. అసలే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే..కొందరు అభిమానులు ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ఎక్కువైంది. ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి రావడం కష్టమనే విషయం అర్ధమవుతుంది. అయినా సరే అభిమానులు..ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎక్కడ చూసిన సీఎం ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు.

ఇక గత కొంతకాలం నుంచి ఈ పరిస్తితి ఆగింది. కానీ ఇటీవల చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడటం, చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం…దీంతో వైసీపీ నేతలకు నందమూరి ఫ్యామిలీ వార్నింగ్ ఇవ్వడం జరిగాయి. అలాగే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. కానీ చాలా డిప్లమాటిక్‌గా తారక్ స్పందించారు. తారక్ స్పందన టీడీపీ నేతలకు నచ్చలేదు. దీనిపై వర్ల రామయ్య కాస్త ఘాటుగానే స్పందించారు.

ఇక వర్ల రామయ్య వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. ఎన్టీఆర్‌ని ఏమన్నా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో హడావిడి చేశారు. తాజాగా కుప్పంలో జై లవకుశ స్పెషల్ షో ఏర్పాటు చేశారు. దీనికి ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.

అయితే సినిమా థియేటర్ వద్ద…ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎన్టీఆర్ జెండాలతో హల్చల్ చేశారు. ‘సీఎం ఎన్టీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ‘జై ఎన్టీఆర్’..’CM ఎన్టీఆర్’..’బాబులకే బాబు తారక్‌బాబు’ కుప్పంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేశారు. ఇంత సడన్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు లవకుశ షో వేసుకుని మరీ ఇలా హడావిడి చేశారనే దానికి కారణం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.

వర్లతో పాటు ఇతర టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పైగా ఇందులో కొంత వైసీపీ శ్రేణులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కావాలనే కుప్పంలో బాబుని టార్గెట్ చేసి ఎన్టీఆర్‌ని హైలైట్ చేసినట్లు తెలుస్తోంది.

Discussion about this post