రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని, పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లో సభలు పెట్టాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఓ కొత్త జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. అయితే ఈ జీవో అందరికీ వర్తిస్తుందని, వైసీపీకి కూడా ఈ జీవో వర్తిస్తుందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత జగన్..రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు.

ఇదే సమయంలో కుప్పం పర్యటనకు వెళ్ళిన బాబుకు..రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రచార వాహనం, మైకులు పోలీసులు లాగేసుకున్నారు. ఆఖరికి ఖాళీ ప్రదేశంలో ఉన్న రచ్చబండ సభని కూడా రద్దు చేశారు. దీంతో చంద్రబాబు పోలీసులపై విరుచుకుపడ్డారు. తన ప్రజలతో మాట్లాడటానికి ఈ ఆంక్షలు ఏంటని పోలీసులతో వాదించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో..పాదయాత్ర ద్వారా ఇంటింటికి తిరిగారు. అటు టీడీపీ శ్రేణులని నిలువరించాలని పోలీసులు ప్రయత్నించారు గాని..కార్యకర్తలు ఎక్కడా తగ్గలేదు. భారీ సంఖ్యలో బాబుతో పాటు వచ్చారు.

అయితే ఇలా ఓ జీవో తీసుకొచ్చి కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేయడం సరికాదనే వాదన వస్తుంది. పాదయాత్ర అయిన, బస్సు యాత్ర అయిన రోడ్లపైనే చేయాలని..గతంలో జగన్ పాదయాత్ర గాని, సభలు గాని రోడ్లపైనే పెట్టారు. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఒక రూల్..అధికారంలోకి వచ్చాక ఒక రూల్ అంటూ పవన్ ఫైర్ అయ్యారు. కుప్పంలో బాబుని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు.

ఇలా బాబుని అడ్డుకోవడం వల్ల..ప్రజల్లో ఇంకా ఆయనపై సానుభూతి పెరిగేలా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే జగన్..పరోక్షంగా బాబుకు మేలు చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఎంత అడ్డుకుంటే అంత ఎక్కువగా బాబుకు రాజకీయంగా కలిసొచ్చేలా ఉంది.

Leave feedback about this