ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే రెడ్డి సామాజికవర్గం అడ్డా అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రెడ్డి వర్గం ఆధిక్యం ఉంటుంది. అందుకే ఇక్కడ మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక 14 సీట్లలో 9 మంది రెడ్డి ఎమ్మెల్యేలే అంటే..అక్కడ రెడ్డి డామినేషన్ ఎలా ఉందో చూడవచ్చు. పత్తికొండ, ఆలూరుల్లో బీసీ ఎమ్మెల్యేలు ఉండగా, నందికొట్కూరు, కోడుమూరు రిజర్వడ్ స్థానాలు. ఇక కర్నూలు సిటీలో హఫీజ్ ఖాన్ ఉన్నారు.

అయితే వైసీపీలోనే కాదు..టిడిపిలో కూడా రెడ్డి నేతల హవా ఎక్కువ. మెజారిటీ సీట్లలో రెడ్డి నేతలే పోటీ చేస్తారు. ఈ సారి జిల్లాలో సత్తా చాటాలని టిడిపి రెడ్డి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని రెడ్డి ఫ్యామిలీలు సత్తా చాటాలని చూస్తున్నాయి. టిడిపిలో కోట్ల ఫ్యామిలీ రెండు సీట్లలో ఉంది. కర్నూలు ఎంపీ సీటులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆలూరులో కోట్ల భార్య సుజాతమ్మ ఉన్నారు. అటు ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా ఫ్యామిలీ హవా ఉంది.



ఇక గౌరు ఫ్యామిలీ సైతం రెండు సీట్లలో టీడీపీని చూసుకుంటుంది. పాణ్యంలో గౌరు చరితా రెడ్డి, నందికొట్కూరు బాధ్యతలని గౌరు వెంకటరెడ్డి చూసుకుంటున్నారు. నంద్యాల పార్లమెంట్ సీటులో గౌరు బామ్మర్ది మాండ్ర శివానంద రెడ్డి ఉన్నారు.

అటు వైసీపీలో రెడ్డి ఫ్యామిలీ ఉన్నాయి. నంద్యాల ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర రెడ్డి ఉండగా, శ్రీశైలం ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. అటు మంత్రాలయంలో వై. బాలనాగిరెడ్డి ఉండగా, ఆదోనిలో వై. సాయిప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఇలా కర్నూలు జిల్లాలో రెడ్డి ఫ్యామిలీల హవా ఉంది. మరి ఈ సారి వీరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.


