కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ సాధించిన విజయాలే నిదర్శనం. అసలు గత ఎన్నికల్లో అయితే మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. మొత్తం 14 సీట్లలో వైసీపీదే గెలుపు. మరి ఈ సారి కూడా వైసీపీకి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏమో చెప్పడం కష్టమే. ఈ సారి ఎన్నికల్లో కర్నూలులో వైసీపీ అన్నీ సీట్లు గెలవడం మాత్రం కష్టమే అని చెప్పొచ్చు.

ఎందుకంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది. అటు వైసీపీ పాలన పట్ల కూడా ప్రజలు ఏమి సంతృప్తిగా లేరు. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి, స్థానిక ఎన్నికల్లో మంచి విజయాలు అందుకుంటున్నారు. అధికార బలంతోనే ఈ విజయాలు వస్తున్నాయని చెప్పొచ్చు. వీటినే బట్టి తమకే ప్రజల మద్ధతు ఎక్కువ ఉందని వైసీపీ నేతలు ఫీల్ అయితే, తప్పులో కాలు వేసినట్లే.

కాబట్టి ఇప్పుడు వ్యతిరేకత ఎదురుకుంటున్న నియోజకవర్గాల్లో…నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమయ్యేలా ఉంది. సుమారు ఐదు నియోజకవర్గాల్లో వైసీపీపై బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ ఐదు చోట్ల టీడీపీకి గెలవడానికి మంచి అవకాశం దొరికినట్లే అని చెప్పొచ్చు. టీడీపీకి గెలవడానికి మంచి అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు వచ్చి…బనగానపల్లె, ఆలూరు, కర్నూలు సిటీ, మంత్రాలయం, కోడుమూరు స్థానాలు. ఈ ఐదు చోట్ల వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరిగినట్లే తెలుస్తోంది.

అలాగే ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయినట్లు తెలుస్తోంది. అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ఐదు చోట్ల టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. చూడాలి మరి ఈ సారి కర్నూలు జిల్లాలో ఎలాంటి ఫలితాలు వస్తాయో.

Discussion about this post