May 31, 2023
ap news latest AP Politics Politics TDP latest News YCP latest news

కర్నూలులో టీడీపీ అభ్యర్ధులు ఫిక్స్…వైసీపీకి భారీ దెబ్బ!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ సారి సత్తా చాటాలని టి‌డి‌పి కష్టపడుతుంది. గత నాలుగు ఎన్నికల నుంచి కర్నూలులో టి‌డి‌పి మంచి ఫలితాలు సాధించలేదు. ఇక గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. 14కి 14 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అలా వైసీపీ పట్టు సాధించింది. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టాలనే విధంగా టి‌డి‌పి నేతలు పనిచేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే సమయం  ఉండగానే జిల్లాలో టి‌డి‌పి అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయిపోయారు.

చంద్రబాబు కొందరు అభ్యర్ధులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ముఖ్యంగా గెలుపుకు దగ్గరగా ఉన్న సీట్లలో అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ సర్వేలో జిల్లాలో 14 సీట్లు ఉంటే టి‌డి‌పి 7, వైసీపీ 7 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. టి‌డి‌పి గెలిచే సీట్లు వచ్చి..బనగానపల్లె, ఆలూరు, మంత్రాలయం, శ్రీశైలం, కోడుమూరు, పత్తికొండ, ఆదోని సీట్లు ఉన్నాయి.

అయితే బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఆదోనిలో మీనాక్షి నాయుడు బరిలో దిగనున్నారు. ఇటు శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేయనున్నారు. కోడుమూరులో ఆకెపోగు ప్రభాకర్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి బరిలో దిగుతారు. ఆలూరులో కోట్ల సుజాతమ్మ పోటీ చేయనున్నారు. పత్తికొండలో కే‌ఈ శ్యామ్ పోటీ చేస్తారు.

అటు మిగిలిన సీట్లలో కూడా అభ్యర్ధులు దాదాపు ఫిక్స్. పాణ్యంలో గౌరు చరితా రెడ్డి పోటీ చేస్తారు. కర్నూలు సిటీలో టీజీ భరత్, డోన్ లో సుబ్బారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండు చోట్ల అభ్యర్ధులు మారే అవకాశం ఉంది. నందికొట్కూరులో ఇంకా అభ్యర్ధి తేలలేదు. ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారు. అంటే కర్నూలులో దాదాపు టి‌డి‌పి అభ్యర్ధులు ఫిక్స్.