ఎప్పుడైతే కర్నూలు జిల్లాలో బాబు పర్యటన విజయవంతమైందో అప్పటినుంచి ఆ జిల్లాలో తెలుగుదేశం నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో జిల్లాలో మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. దీంతో ఇక్కడ పట్టు సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల బాబు టూర్‌కు ప్రజల నుంచి అనుహ్యా స్పందన వచ్చింది. పత్తికొండ, ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆలూరు స్థానాల్లో బాబు రోడ్ షోలకు భారీగా జనం వచ్చారు.

ఇక ఇదే ఊపుని ఏ మాత్రం తగ్గకుండా టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు. ప్రజా మద్ధతు పెరిగేలా పోరాటాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. అధికార వైసీపీకి ధీటుగా పోరాడుతున్నారు. తాజాగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అనంతపురం జిల్లా నేతలతో కలిసి గొంతు ఎత్తారు. ఈ ర్యాలీకి కూడా భారీ స్పందన వచ్చింది.

అయితే కర్నూలులో టీడీపీ బలం పెరుగుతుందని అర్ధమవుతుంది..కానీ ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. కొందరు నేతలు మాత్రమే దూకుడుగా పనిచేస్తుంటే…కొందరు ఎఫెక్టివ్ గా పనిచేయలేకపోతున్నారు. దీని వల్ల కొన్ని స్థానాల్లో టీడీపీకి బలం కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో బనగానపల్లె, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, పత్తికొండ, డోన్ లాంటి సీట్లలో టీడీపీ పరిస్తితి కాస్త పర్లేదు. కానీ పాణ్యం, శ్రీశైలం, కోడుమూరు, నంద్యాల, ఆళ్లగడ్డ నందికొట్కూరు, మంత్రాలయం లాంటి సీట్లలో టీడీపీ బలం ఇంకా పెరగాలి.

ముఖ్యంగా భూమా ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి మెరుగైనట్లు కనిపించడం లేదు. మొత్తానికి కర్నూలులో టీడీపీ ఇంకా బలపడాల్సి ఉంది.
