రాష్ట్రంలో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే..ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే కసితో టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. మామూలుగా వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలని అణిచివేసే కార్యక్రమాలు చేయకపోతే…తెలుగు తమ్ముళ్ళలో అంతగా కసి అవ్చ్చి…దూకుడుగా పనిచేసేవారు కాదేమో. కానీ ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి రాగానే కేవలం కక్షపూరితంగా టీడీపీ నేతలని ఎక్కడకక్కడ అణిచి వేయడం, కేసులు పెట్టడం, దాడులు చేయడం, జైలుకు పంపడం, ఆర్ధికంగా తోక్కేయడం లాంటి కార్యక్రమాలు చేసిందో…అప్పటినుంచి తమ్ముళ్లలో కసి పెరిగింది.

అయితే కేసులకు మొదట్లో తమ్ముళ్ళు భయపడ్డారు…కానీ నిదానంగా తిరగబడే పరిస్తితి వచ్చింది..ఇలాగే ఉంటే కష్టమని చెప్పి ఇంకా దూకుడుగా పనిచేయడం స్టార్ట్ చేశారు…ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారం రాకపోతే మళ్ళీ ఇబ్బందులు ఎదురుకోవాలని అనుకుంటూ…తమ్ముళ్ళు ఇంకా వైసీపీపై పోరాటం మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు.అలా దూకుడుగా పనిచేయడం వల్లే వైసీపీ కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో సైతం టీడీపీ నేతలు పికప్ అయ్యారు. ముఖ్యంగా వైసీపీ అడ్డాగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిస్తితి చాలా మారింది. జిల్లా మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే. 14 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అంటే టీడీపీ జీరో నుంచి ఎదిగేందుకు పోరాడుతుంది. అయితే మూడేళ్లలోనే సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. అలాగే టీడీపీ నేతలు ఎక్కడకక్కడ కష్టపడుతూ…పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు.

ప్రస్తుతం కర్నూలులో ఉన్న రాజకీయ పరిస్తితులని గమనిస్తే పలు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయింది…టీడీపీ పికప్ అవుతున్న నియోజకవర్గాల్లో బనగానపల్లె, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, కర్నూలు సిటీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు స్థానాల్లో టీడీపీ నేతలు గట్టిగానే కష్టపడుతున్నారు. మొత్తానికైతే కర్నూలులో ఈ సారి టీడీపీ మంచి ఫలితాలే సాధించేలా ఉంది.
Discussion about this post