యువగళం పాదయాత్రతో నారా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో ప్రజల్లో తిరుగుతున్న లోకేష్..ఇప్పుడు పూర్తి స్థాయి ప్రజా నాయకుడుగా మారిపోయారని చెప్పవచ్చు. ఆయన మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారాయి. ప్రజలని ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.
లోకేష్ పాదయాత్రకు ప్రజల మద్ధతు రోజురోజుకూ పెరుగుతుంది. అయితే వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలులో ఆయన పాదయాత్ర ఎలా సాగుతుందో అని అంతా ఎదురుచూశారు. కానీ ఊహించని విధంగా ఆయన పాదయాత్ర విజయవంతంగా సాగుతుంది. అలాగే ఆయన పర్యటించే ప్రతి నియోజకవర్గంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. దీంతో టిడిపికి పెద్ద అడ్వాంటేజ్ అవుతుందనే చెప్పాలి. మొదట జిల్లాలో డోన్ లో పాదయాత్ర చేశారు..అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే గత రెండు ఎన్నికల్లో డోన్ లో టిడిపి ఓడిపోతూ వస్తుంది.

కానీ ఈ సారి అక్కడ వైసీపీకి టిడిపి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని చెప్పవచ్చు. ఇక పత్తికొండలో గత ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలైంది. ఈ సారి అక్కడ టిడిపికి లోకేష్ పాదయాత్ర వల్ల కొత్త ఊపు వచ్చింది. ఈ సారి పత్తికొండలో టిడిపి గెలుపు ఖాయమనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఆలూరులో పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ భారీ సంఖ్యలో జనం వస్తున్నారు.
ఇక గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి కోట్ల ఫ్యామిలీకి విజయం ఖాయమని చెప్పవచ్చు. లోకేష్ తో పాటు సుజాతమ్మ దూకుడుగా పాదయాత్రలో పాల్గొంటూ…టిడిపిని బలోపేతం చేస్తున్నారు. మొత్తానికి లోకేష్ పాదయాత్ర చేసే నియోజకవర్గాల్లో టిడిపికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు.