సాధారణంగా మంత్రులుగా చేసిన వారు, స్పీకర్ గా పనిచేసిన వారు మళ్ళీ గెలవడం అనేది ఏపీ రాజకీయాల్లో అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు స్పీకర్ గా చేసిన వారు మళ్ళీ గెలవడం అనేది జరగదు. గతంలో టిడిపి హయంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు స్పీకర్ గా తమ్మినేని సీతారాం పనిచేస్తున్నారు. ఈయన కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని పలు సర్వేల్లో కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే మంత్రులుగా పనిచేసిన వారు మళ్ళీ గెలవడం కూడా తక్కువే ఉంటుంది. టిడిపి హయంలో మంత్రులుగా చేసిన వారు..2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఏదో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప లాంటి వారు మళ్ళీ గెలిచారు. ఇప్పుడు వైసీపీ మంత్రులు సైతం గెలుపుకు దూరం అవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందులో లేడీ మంత్రులకు రిస్క్ ఎక్కువ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు.

తానేటి వనిత, విడదల రజిని, రోజా, ఉషశ్రీ చరణ్…ఈ నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఈ నలుగురు మంత్రుల్లో కొద్దో గొప్పో వనితకు కాస్త పరిస్తితి బాగానే ఉందని తెలుస్తోంది. మిగిలిన ముగ్గురికి వారి వారి స్థానాల్లో అనుకూలమైన పరిస్తితులు లేవని సర్వేల్లో తేలింది. రోజాకు నగరిలో నెగిటివ్ కనిపిస్తుంది. సొంత పార్టీ నుంచి ఆమెకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో పాజిటివ్ ఉన్న రజినికి చిలకలూరిపేటలో మాత్రం పెద్దగా పాజిటివ్ లేదట.



అటు కళ్యాణదుర్గంలో ఉషశ్రీచరణ్‌కు నెగిటివ్ కనిపిస్తుంది. ఇక కొవ్వూరులో వనితకు పెద్ద పాజిటివ్ లేదు..కాకపోతే అక్కడ టిడిపికి సరైన నాయకులు లేకపోవడం వనితకు ప్లస్. మొత్తానికి చూసుకుంటే ఈ సారి లేడీ మంత్రులు గెలిచి గట్టెక్కేలా లేరు.

Leave feedback about this