కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట..వరుసగా ఏడుసార్లు ఆయన అక్కడ గెలుస్తూ వచ్చారు. అయితే టిడిపి ఆవిర్భావం నుంచి కుప్పంలో పసుపు జెండా ఎగురుతుంది. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఇక 1989 నుంచి కుప్పం బరిలో బాబు దిగుతూ అదిరిపోయే విజయాలు అందుకుంటున్నారు. ఇలా తిరుగులేని పొజిషన్ లో ఉన్న చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ వ్యూహాలు వేస్తుంది.
అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ చేస్తున్న రాజకీయం ఏంటో అందరికీ తెలిసిందే. అధికార బలంతో అక్కడ ప్రజలని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బలంతో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇంకా కుప్పం అసెంబ్లీని కైవసం చేసుకుంటామని వైసీపీ నేతల్ ఛాలెంజ్ చేస్తున్నారు.

కానీ కుప్పం దక్కించుకోవడం వైసీపీకి అంత సులువు కాదు. కుప్పం దక్కాలంటే పెద్ద అద్భుతం జరగాలి. అదే సమయంలో వైసీపీకి కౌంటరుగా ఈ సారి కుప్పంలో లక్ష మెజారిటీతో గెలిచి చూపిస్తానని చంద్రబాబు అంటున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించి..కుప్పంలో మెజారిటీ పెంచుకునే దిశగా బాబు పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో బాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు.
అయితే కుప్పంలో ఇప్పటివరకు చంద్రబాబు అత్యధిక మెజారిటీ 65 వేలు..ఇది 1999 ఎన్నికల్లో వచ్చింది..కొన్ని సార్లు 50 వేలు, 40 వేలు మెజారిటీలు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లోనే 30 వేలు వచ్చాయి. దాన్ని త్రిబుల్ చేయాలని చూస్తున్నారు. మరి లక్ష మెజారిటీ సాధ్యమేనా? అంటే వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలకు కుప్పం ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు..కాబట్టి ఆ మెజారిటీ దక్కడం ఏమి పెద్ద కష్టం కాదు. చూడాలి మరి బాబు ఈ సారి చరిత్ర సృష్టిస్తారేమో.