ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో..ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైంది. ఏ పార్టీకి ఆ పార్టీ వారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇటు ఎమ్మెల్యే అభ్యర్ధులు సైతం సొంతంగా తమ గెలుపోటములపై సర్వేలు చేయించుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ సర్వే ఒకటి బయటకొచ్చింది. ఇన్‌సైడ్ ఎలక్షన్ అనే సంస్థ..ఏపీ మొత్తం సర్వే నిర్వహించింది..దాదాపు లక్ష శాంపిల్స్ వరకు తీసుకుని సర్వే చేసినట్లు తెలిసిందే.
ఆ సర్వే సంస్థ మూడు ప్రాంతాలుగా విభజించి సర్వే చేసింది..ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాలు కలిపి ఒక ప్రాంతం..రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఒక ప్రాంతం. కోస్తాలోని 6 జిల్లాలు కలిపి ఒక ప్రాంతంగా చేసింది. అయితే ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే 39 సీట్లు చూపించింది..కోస్తాలో 89 సీట్లు ఉంటే 84 సీట్లుగా చూపించింది. సీమలో 52 సీట్లుగా అలాగే పెట్టింది. ఈ సర్వే ప్రకారం..ఉత్తరాంధ్రలో వైసీపీకి 48.7 శాతం ఓట్లు, టిడిపికి 47.2 శాతం ఓట్లు, జనసేనకు 1.7 శాతం ఓట్లు ఇచ్చింది..మిగిలింది ఇతరులకు ఇచ్చింది.

అటు కోస్తాలో వైసీపీకి 41.3 శాతం, టిడిపికి 48.2 శాతం, జనసేనకు 9.9 శాతం ఇచ్చింది. సీమలో వైసీపీకి 48.7 శాతం, టిడిపికి 45.6 శాతం, జనసేనకు 1.9 శాతం ఇచ్చింది. ఓవరాల్ గా వైసీపీకి 45.1 శాతం, టిడిపికి 47.1 శాతం, జనసేనకు 5.7 శాతం, ఇతరులకు 2.1 శాతం ఇచ్చింది. సీట్ల పరంగా చూస్తే..వైసీపీకి 65-81 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, టిడిపికి 88-104 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, జనసేనకు 4-8 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పింది. అంటే ఆధిక్యం టిడిపికి ఇచ్చింది. టిడిపి సింగిల్ గా పోటీ చేసి అధికారంలోకి రావచ్చు అని తేల్చి చెప్పింది.
