May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

లక్ష్మీపార్వతి గెలిచిన చోట సైకిల్ జోరు..ఈ సారి వైసీపీకి చెక్.!

ఏపీ రాజకీయాల్లో లక్ష్మీపార్వతి గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ రెండోభార్యగా ఉంటూ ఆమె ఏ విధంగా రాజకీయాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. సరే గతం గతః అనుకుంటే..ఇప్పుడు ఆమె వైసీపీలో ఉంటూ టి‌డి‌పిని దెబ్బతీయడానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే..గతంలో లక్ష్మీపార్వతి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిందనే సంగతి ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఆమె కుట్రలు చేసిందని టి‌డి‌పి శ్రేణులు ఇప్పటికీ ఫైర్ అవుతూ ఉంటాయి..అలాగే రాజకీయం గా పార్టీ పెట్టి ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత..ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఫెయిల్ అయింది గాని..అప్పటిలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 పాతపట్నం ఉపఎన్నికలో బి‌జే‌పి సపోర్ట్ తో ఎన్టీఆర్ టి‌డి‌పి నుంచి పోటీ చేసి లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన పాతపట్నంలో ఇప్పుడు టి‌డి‌పి హవా మొదలైంది. అయితే గతంలో ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలు సాధించింది.

కానీ 2009 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇక గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు. ఈమెపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ సారి గాని ఆమెకు మళ్ళీ సీటు ఇస్తే వైసీపీ ఓడిపోతుందనే పరిస్తితి. ఇక ఇక్కడ టి‌డి‌పి ఇంచార్జ్ కలమట వెంకటరమణ దూసుకెళుతున్నారు.

రాజకీయంగా బలపడ్డారు. 2009లో ఈయన టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయి…2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి..మళ్ళీ టి‌డి‌పిలోకి వచ్చారు. 2019లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలుపు దిశగా వెళుతున్నారు. ఈ సారి పాతపట్నం టి‌డి‌పి వశం అయ్యేలా ఉంది