టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్‌కు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు సీనియర్లు. తాజాగా టీడీపీ 40వ వసంతం వేడుకలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ చాలా గంభీరంగా ప్రసంగించారు. అంతేకాదు.. పార్టీ అధినేత చంద్రబాబు కన్నా కూడా ఎక్కువ సమయం.. లోకేష్ ప్రసంగించారు. ఆయన ప్రసంగించిన సమయంలో కార్యకర్తల నుంచి ఈలలు, చప్పట్లతో ప్రాంగణం అధిరిపోయింది.

ఇక, సీఎం జగన్ కేంద్రంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. సినీ డైలాగులతో కూడిన పంచ్ డైలాగులు పేల్చడంతో లోకేష్ ప్రసంగం శైలి గతానికి భిన్నంగా మారిందనే వాదన వినిపించింది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో ఆయనకు లైన్ క్లియర్ అయిందని.. అంటున్నారు . పైగా చంద్రబాబు సైతం.. యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం.. 40 శాతం సీట్లు వారికే ఉంటాయని వివరించడం వంటివి కూడా.. లోకేష్‌ను దృష్టిలో పెట్టుకునే వేసిన అడుగులుగా చెబుతున్నారు.

తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవాలంటే.. చంద్రబాబు ముందుగా పార్టీలోనే యువతరాన్ని ప్రోత్సహించాలని అనుకోవడం అందరూ ఆహ్వానిస్తున్న పరిణామం. ఈ నేపథ్యంలో లోకేష్‌కు దాదాపు లైన్ క్లియర్ అయిందని.. సీనియర్ల నేతల మధ్య చర్చసాగుతోంది. నిజానికి గత 2014 ఎన్నికల్లోనే డిజిటల్ రూపంలో పార్టీనిముందుకు నడిపించాడు లోకేష్. 2019 ఎన్నికల్లో స్వయంగా రంగంలోకి దిగి.. పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఇక, ఇప్పుడు.. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు.. పార్టీకి పునాదులు వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించడం ఖాయమని అంటున్నారు.

ఇదే విషయం .. తాగా 40 ఏళ్ల వసంతం వేడుకగా స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. ఇక, దీనిని బట్టి లోకేష్ రాబోయే రోజుల్లో మరింతగా దూకుడు చూపించడం.. అధికార పార్టీపై మరింతగా రెచ్చిపోవడం ఖాయమని సీనియర్లు చెబుతున్నారు. ఇక, నుంచి ప్రజల్లోనే ఉండాలని లోకేష్ యువతకు పిలుపునివ్వడాన్ని బట్టి.. ఆయన కూడా .. ఇకవచ్చే రెండేళ్లు పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Discussion about this post