అధికారంలో ఉన్నాం కదా ఏది చెబితే అది జనాలు నమ్మేస్తారనే భావనలో అధికార వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఆఖరికి సిఎం జగన్ కూడా అదే భావనలో ఉన్నారు. ప్రజలు అధికారం కట్టబెట్టారు..ఇంకా తాము ఏది చేసినా..ఏమి చెప్పినా జనం అంగీకరిస్తారని అనుకుంటున్నానరు. అందుకే ఏది పడితే అది చెప్పేస్తున్నారు. కానీ జనం నమ్మట్లేదనే విషయం తెలుసుకోలేకపోతున్నారు.

అసలు ఏ మాత్రం లాజిక్ లేకుండా చెప్పేయడం..తమదే పై చేయి అన్నట్లు భావించడం..ఇది జగన్ చేస్తున్న పని. తాజాగా వైసీపీ వర్క్ షాపులో కూడా అదే చేశారు. ఎంతసేపు తాను చేయాల్సింది చేస్తున్నానని, ఇంకా ఎమ్మెల్యేలు చేయాల్సిందే చేస్తే 175 సీట్లు గెలుస్తామని అంటున్నారు. అసలు జగన్ ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసు. పన్నుల రూపంలో డబ్బులు అధిక మొత్తంలో ప్రజల నుంచి తీసుకుని ఏదో కొంతమేర పథకాల రూపంలో డబ్బులు ఇస్తున్నారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు. ప్రజల్లో తిరగడం లేదు. ఇవన్నీ చేయకుండా ఎంతసేపు ఎమ్మెల్యేలదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు.

పైగా ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలవడం, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచినా సరే..ఆ విజయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. వాస్తవానికి 17 మంది ఎమ్మెల్సీలను వైసీపీ గెలిస్తే.. కేవలం 4 ఎమ్మెల్సీ స్థానాలనే టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ ఒంటరిగా పోటీ చేసిందిని, టీడీపీ ద్వితీయ ప్రాధాన్య ఓటుతో ఇతరులతో కలసి గెలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల పరిధిలోకి రారని, వారు 2.5 శాతానికి మించి ఉండరని, పథకాల లబ్ధిదారులు 80 శాతం మంది ఉంటే.. ఎమ్మెల్సీ ఓటర్లు 20 శాతం మంది మాత్రమేనని, ఎలక్టొరల్ శాంపిల్ సర్వే పరిధిలోకి వీరు రారని, టీడీపీ వాపును చూసి బలుపుగా భావిస్తోందని జగన్ అంటున్నారు.