టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు.

టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు. లోక్‌సభ, రాజ్యసభలు టీఆర్ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభించనుంది. టీఆర్ఎస్ తరపున లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు.
ఈ రోజు జరుగుతున్న బీఏసీకి నామాని ఆహ్వానిస్తూ లోక్‌సభ సచివాలయం సమాచారం ఇచ్చింది. మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై చర్చించేందుకు బేఏసీ సమావేశం ఉన్నట్లు లోకసభ సచివాలయం సమాచారం పంపించింది. బీఏసీ సమావేశ సమాచారంలో విషయం బయటపడింది. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం లోకసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. దీంతో లోకసభ సచివాలయం ఆహ్వానితుల జాబితాలోకి తీసుకుంది.

