నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కుప్పం, పలమనేరు దాటుకుని పూతలపట్టులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే లోకేష్ పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ నేతలకు అదే స్థాయిలో లోకేష్ కౌంటర్లు ఇస్తున్నారు. ఏ మాత్రం తగ్గకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారు.

కాకపోతే లోకేష్ పాదయాత్రకు మీడియా అనుకున్నంత కవరేజ్ ఇవ్వడం లేదు..ముఖ్యంగా వైసీపీకి అనుకూల మీడియా లోకేష్ పాదయాత్రకు కవరేజ్ పెద్దగా ఇవ్వడం లేదు. పైగా నెగిటివ్ కామెంట్స్‌ని ప్రచారం చేస్తుంది. అయితే ఈ నెగిటివ్ కామెంట్స్‌ని తిప్పికొట్టి లోకేష్ పాదయాత్రకు హైప్ ఇవ్వడంలో టిడిపి సోషల్ మీడియా విభాగం అనుకున్న మేర సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. కానీ ఏది వచ్చిన లోకేష్ డీల్ చేస్తున్నారు. స్థానికంగా మాత్రం లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యా స్పందన వస్తుంది. అలాగే ప్రజా సమస్యలని తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళుతున్నారు.

కానీ లోకేష్ సైలెంట్ గా ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ ముందుకెళుతున్నారు..ఎక్కడకక్కడ పలు వెనుకబడిన వర్గాలతో సమావేశమవుతూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇటు జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతున్నారు. అయితే లోకేష్ ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, యువతని టార్గెట్ చేసుకునే ముందుకెళుతున్నారు.

వారిని దగ్గర చేసుకోవడంలో లోకేష్ సక్సెస్ అవుతున్నారు. ఇటు నాయకుడుగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న సరే లోకేష్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొత్తానికి లోకేష్ పాదయాత్ర టిడిపికి పెద్ద అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది.
