నారా లోకేష్ పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.. అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రజల నుంచి పాదయాత్రకు మంచి స్పందన వస్తుంది. లోకేష్ అడుగడుతున ప్రజలని కలుస్తూ..వారి సమస్యలని తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ పాదయాత్ర టిడిపికి కొత్త ఊపు తీసుకొస్తుంది..అదే సమయంలో లోకేష్ ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా తయారవ్వడంలో పాదయాత్ర బాగా ఉపయోగపడుతుంది.

అయితే లోకేష్ పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్నీ స్థానాల్లో కొనసాగనుంది. దీని వల్ల చిత్తూరులో టిడిపి బలం ఏమైనా పెరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే పేరుకు చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికి…ఇక్కడ ఆధిక్యం వైసీపీదే. గత రెండు ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీ హవా నడిచింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో 13 వైసీపీ గెలుచుకుంటే, కేవలం కుప్పం మాత్రం టిడిపి గెలుచుకుంది. ఇప్పుడు కుప్పంతో సహ 14 సీట్లు వైసీపీ గెలుచుకోవాలని ఎలాంటి రాజకీయం చేస్తుందో తెలిసింది. కానీ వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని, చంద్రబాబు కష్టపడుతున్నారు.

జిల్లాలో లీడ్ తెచ్చుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ పాదయాత్ర చేయడం చిత్తూరు జిల్లాలో టిడిపికి కొత్త ఊపు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. జిల్లాలో ప్రస్తుతానికి మాత్రం వైసీపీదే ఆధిక్యం కనిపిస్తుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీకి 8 సీట్లలో, టీడీపీకి 6 సీట్లలో లీడ్ కనిపిస్తుంది.

అయితే పాదయాత్ర పూర్తి అయ్యాక జిల్లాలో సీన్ మారుతుందని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. పైగా జనసేనతో గాని పొత్తు ఉంటే చిత్తూరు, తిరుపతి లాంటి సీట్లలో వైసీపీకి చెక్ పెట్టవచ్చు. చూడాలి మరి లోకేష్ పాదయాత్రతో చిత్తూరులో టిడిపి బలం ఏ మేర పెరుగుతుందో.

Leave feedback about this