రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి వ్యూహాలే అవసరం లేదు…ఒకోసారి మాటలతో సైతం కట్టడి చేయొచ్చు. నాయకులని టార్గెట్ చేసుకుని నెగిటివ్ చేయడానికి ఒకే రకమైన విమర్శని పదే పదే చేస్తే సరిపోతుంది. కాకపోతే ఏ నాయకుడైన…తన ప్రత్యర్ధి నాయకుడుని మాటలు అనే ముందు తన బ్యాగ్రౌండ్ ఏంటో చూసుకోవాలి…అప్పుడే మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది…అవి జనంలోకి వెళ్తాయి. అలా కాకుండా ఎడాపెడా మాటలు అనేస్తే అవి పూర్తిగా రివర్స్ అవుతాయి.

ఇప్పుడు అధికార వైసీపీ నేతలకు అదే పరిస్తితి వచ్చేలా ఉంది….ఇటీవల టీడీపీ నేత నారా లోకేష్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్ టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు. అయితే జగన్‌పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కౌంటర్లు ఇవ్వడంలో తప్పు లేదు గానీ, వైసీపీ నేతలు ఏ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తారో చెప్పాల్సిన పని లేదు.

పైగా లోకేష్ రౌడీలాగా మాట్లాడుతున్నారని, ఇక బూతులు మాట్లాడుతున్నారని చెప్పి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. లోకేష్ భాష అసభ్యంగా ఉందని అని చెప్పి అంటున్నారు. అంటే ఇలా చెప్పేది రోజా, విజయసాయిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..ఇలా ఇతర వైసీపీ నేతలు అనమాట. అంటే లోకేష్ రౌడీ, బూతులు మాట్లాడుతున్నారని అంటున్నారు.

అయితే గురివింద గింజ తన కింద నలుపుని ఎరగదు అన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉందని, ఎవరు చేసేది వారికే కనిపిస్తుందని, ఈ వైసీపీ నేతలు ఏం చేస్తారో జనాలకు బాగా తెలుసని, పైగా లోకేష్‌ని విమర్శిస్తూ…..నీతులు చెప్పాలని అనుకుంటున్నారని, ఈ నీతులని జనం నమ్మే పరిస్తితుల్లో లేరని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. లోకేష్‌ని పూర్తిగా నెగిటివ్ చేయడానికే అందరూ ఒకేసారి పడ్డారని, కానీ ఇలాంటి నేతలు నీతులు చెబుతుంటే కామెడీగా ఉంటాయని అంటున్నారు.

Discussion about this post